Site icon NTV Telugu

PoK Protests: పీఓకేలో అదుపుతప్పిన పరిస్థితి.. అసలు అక్కడ ఏం జరుగుతుంది?

Pok Protests

Pok Protests

PoK Protests: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రస్తుతం పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తుంది. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పాలకులు ఇంటర్నెట్‌ను నిలిపి వేయడంతో పాటు అన్ని రవాణా మార్గాలను బంద్ చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ అక్కడి జనం సోమవారం నుంచి నిరసనలు చేస్తున్నారు. మంగళవారం కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పాక్ పోలీసులు నిరసనకారులను అదుపు చేయడానికి కాల్పులు జరపగా.. ఇందులో ఇద్దరు స్థానిక పౌరులు మరణించారు. అయినా కూడా ఈ నిరసనలు మాత్రం ఆగలేదు. ఇంతకీ అక్కడ అసలు ఏం జరుగుతుంది..

READ ALSO: SBI Credit Card: ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. ఈ ఛార్జీలు పెంపు

స్వదేశ పౌరులను విస్మరిస్తున్న పాక్ హైకమాండ్..
షాబాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ ప్రపంచ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారు కానీ స్వదేశంలో పౌరులను పట్టించుకోవడం లేదనే వాదనలు అక్కడి ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శాంతిని బోధించే పాకిస్థాన్ ఇప్పుడు తన సొంత ప్రజలపైనే కాల్పులు జరుపుతోందని స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పీఓకేలోని ప్రజలు అక్కడి ప్రభుత్వం నుంచి తమకు ప్రాథమిక హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న యునైటెడ్ అవామీ యాక్షన్ కమిటీ ప్రభుత్వం ముందు 38 డిమాండ్లను ఉంచింది. అధికారంలో ఉన్నవారికి ప్రత్యేక హక్కులను రద్దు చేయడం, కాశ్మీరీ వలసదారులకు రిజర్వు చేసిన 12 అసెంబ్లీ సీట్లను తొలగించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. JKJAAC సోమవారం నుంచి నిరవధిక లాక్‌డౌన్ ప్రకటించింది. ఇదే సమయంలో పీఓకేలో అనేక ప్రదేశాలలో నిరసనలు నిర్వహించింది. ఈక్రమంలో రాజధాని ముజఫరాబాద్‌లో JKJAAC – ISI-మద్దతుగల ముస్లిం కాన్ఫరెన్స్ మధ్య ఘర్షణలు చెలరేగాయి.

ఈసందర్భంగా అవామీ యాక్షన్ కమిటీ చీఫ్ షౌకత్ నవాజ్ మీర్ మాట్లాడుతూ.. నిరసనలు, సమ్మెలను అణిచివేసేందుకు చేసే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు. ఇక్కడ విశేషం ఏమిటంటే పాక్‌లోని ప్రధాన మీడియా సంస్థలు ఈ నిరసనలను వారి ఛానల్స్‌లో ప్రసారం చేయకుండా దూరంగా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

READ ALSO: Tomahawk Missiles: రష్యా – ఉక్రెయిన్ పోరులో అమెరికా సూపర్ వెపన్.. మాస్కో భయానికి కారణం ఏంటి?

Exit mobile version