NTV Telugu Site icon

Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు

Kendriya Vidyalaya

Kendriya Vidyalaya

Kendriya Vidyalaya: బాపట్ల జిల్లా బాపట్ల మండలం సూర్యలంక కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్‌ ల్యాబ్‌లో కెమికల్ పౌడర్ వాసన పీల్చి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గల కారణం కెమికల్ పౌడర్ అని సహచర విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులను బాపట్ల ఏరియా హాస్పిటల్‌కి తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు.. విషయం తెలుసుకున్న వెంటనే హటావుటిన జిల్లా జాయింట్ కలెక్టర్ బి సుబ్బారావు, విద్యార్థులను పరామర్శించారు. ఈ ఘటన ఎందువల్ల జరిగింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాఫీ పొడి, షుగర్‌తో పాటు, సోడియం, ఇతర కెమికల్స్ కలిపిన పౌడర్‌ను, ఓ విద్యార్థి తీసుకువచ్చి సహచర విద్యార్థులకు వాసన చూపించాడని, దీంతోనే విద్యార్థులకు అనారోగ్య సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు.

Read Also: Nagarjuna Akkineni: నాగార్జునకు హైకోర్టులో ఊరట.. కూల్చివేతలు ఆపాలని కోర్టు ఉత్తర్వులు

బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. సైన్స్ ల్యాబ్‌లో విద్యార్థులు కెమికల్ మిక్స్ చేసిన సమయంలో ప్రమాదకర వాయువుల విడుదలతో విద్యార్థులకు అస్వస్థతకు గురైనట్లు ఆయన తెలుసుకున్నారు. ఘటనపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రాణాపాయం లేదని.. వైద్య సాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు.