Site icon NTV Telugu

POCSO Case: మైనర్ బాలికపై లైంగిక వేధింపులు..! మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు

Ex Mla Sudhakar

Ex Mla Sudhakar

POCSO Case: కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి.. దీంతో ఇంటిలో ఉన్న మాజీ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించినట్టుగా తెలుస్తోంది.. అయితే, మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఎన్నికల సమయంలోనే సుధాకర్‌పై ఆరోపణలు వచ్చాయి.. బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తూ వైరల్ గా మారిపోయింది.. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు.. ఇదే సమయంలో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ వ్యవహారం.. ఇప్పుడు కోడుమూరుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది.

Read Also: Annamalai: రాజకీయాలకు అన్నామలై విశ్రాంతి.. కారణం ఏంటంటే..

Exit mobile version