Poco X8s Launched: పోకో ఎక్స్8ఎస్ (Poco X8s) స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉన్న AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ కోసం 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ అందించారు. 6,330mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో 6.35 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇచ్చారు. ఇది 1Hz నుంచి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ డిస్‌ప్లే ప్రత్యేకత. ప్రాసెసింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 చిప్‌సెట్ అందించారు. ఇందులో గరిష్ఠంగా 12GB RAM, 512GB స్టోరేజ్ లభిస్తాయి.
ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో Light Fusion 800 సెన్సార్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫొటో కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20MP కెమెరా ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,330mAh భారీ బ్యాటరీని అందించారు. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అయితే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ ఫోన్‌ను పోలాండ్, సింగపూర్ మార్కెట్లలో విడుదల చేశారు. పోలాండ్‌లో 8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర PLN 1,599 (సుమారు రూ.38,000)గా ఉంది. 12GB RAM, 512GB స్టోరేజ్ మోడల్ ధర PLN 1,799 (సుమారు రూ.43,000). సింగపూర్‌లో 8GB RAM, 256GB వేరియంట్ ధర SGD 619 (సుమారు రూ.45,000)గా నిర్ణయించారు. బ్లూ, బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది.

