Poco X6 Launch: పోకో నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్స్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poco X6 and Poco X6 Pro Launched in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘షావోమీ’ సబ్‌బ్రాండ్ ‘పోకో’ నుంచి మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. పోకో కంపెనీ గురువారం భారత మార్కెట్‌లో పోకో ఎక్స్6, పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. బేస్ మోడల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌తో వస్తుండగా.. ప్రో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300-అల్ట్రా SoCతో వస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, అద్భుత బ్యాటరీలతో వచ్చాయి. ఈ ఫోన్‌ల ధర, ఫీచర్ల వివరాలు చూద్దాం.
పోకో ఎక్స్6 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల డిస్‌ప్లేతో 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేటు, 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 ప్రాసెసర్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్2 ప్రాసెసర్‌తో వస్తోంది. 5100mAh బ్యాటరీ, 167W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో ఈ ఫోన్ వచ్చింది. ఇందులో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా ఉండగా.. సెల్ఫీ కోసం 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. పోకో ఎక్స్6 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 19,999గా ఉండగా.. 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 21,999గా ఉంది. ఇక 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 22,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ మిర్రర్ బ్లాక్, స్నోస్ట్రోమ్ వైట్ రంగుల్లో వస్తుంది.
Also Read
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్‌గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
Also Read: Weather Forecast: వచ్చే వారం నుంచి.. పంచాయతీ స్థాయిలో వాతావరణ సమాచారం: ఐఎండీ
పోకో ఎక్స్6 ప్రోలో పోకో ఎక్స్6లో ఉన్న డిస్‌ప్లే, కెమెరాలే ఉన్నాయి. పోకో ఎక్స్6 ప్రోలో మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ అందించారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో మాత్రమే రానుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 24,999 కాగా.. 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర రూ. 26,999గా ఉంది. ఈ ఫోన్ ఎల్లో, రేసింగ్ గ్రే, స్పెక్టర్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో జనవరి 16 నుంచి ఈ ఫోన్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ప్రీ ఆర్డర్ బుకింగ్‌లు గత రాత్రి నుంచే మొదలయ్యాయి. ఈఎంఐ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారు రూ. 2వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.
తాజావార్తలు
-
Anasuya: నా గొంతు నొక్కేయాలని చూశారు.. భరించలేకే జబర్దస్త్ నుంచి బయటకొచ్చా?
-
Digital Arrest Scam: ముందు కాల్ వస్తుంది.. తర్వాత వీడియో కాల్.. చివరికి ఖాతాలోని డబ్బంతా మాయం!
-
Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
-
CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు’కి అనసూయ పరోక్ష కౌంటర్?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!