POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POCO M8 Power 5G: పోకో (POCO) నుండి భారత మార్కెట్లో పోకో M8 పవర్ 5G (POCO M8 Power 5G) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. 6.99 అంగుళాల OLED డిస్ప్లే, భారీ 8000mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 4 Gen 4 ప్రాసెసర్, 50MP AI కెమెరా వంటి అద్భుత ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వచ్చేసింది.
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే:
ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.99 అంగుళాల FHD+ OLED డిస్ప్లేను అందించారు. ఈ డిస్ప్లే 2396×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. అలాగే ఇది గరిష్టంగా 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్, DCI-P3 వైడ్ కలర్ గామట్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియోతో మంచి విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఇంకా ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్‌ను కూడా ఇందులో అందించారు.
Also Read
- Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
- Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- ఇక ఇంట్లోనే థియేటర్.. 120Hz డిస్ప్లే, 12 స్పీకర్లతో 115-అంగుళాల Sony BRAVIA 9 II భారీ 4K TV లాంచ్.!
Snapdragon 4 Gen 4 ప్రాసెసర్:
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4nm టెక్నాలజీపై తయారుచేసిన Qualcomm Snapdragon 4 Gen 4 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. ఇది AnTuTu బెంచ్‌మార్క్‌లో 6.3 లక్షలకు పైగా స్కోర్ సాధించినట్లు కంపెనీ తెలిపింది. ఎక్కువసేపు వినియోగించినా వేడి తగ్గించేందుకు 10,416 చదరపు మి.మీ. గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.
8000mAh భారీ బ్యాటరీ:
ఈ మొబైల్ ప్రధాన ఆకర్షణ 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. ఇది Xiaomi Surge G1 బ్యాటరీ మేనేజ్మెంట్ చిప్‌తో పని చేస్తుంది. ఈ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. కంపెనీ ప్రకారం బ్యాటరీ 42 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్, 68 గంటల వరకు సోషల్ మీడియా బ్రౌజింగ్, 18 గంటల వరకు గేమింగ్, 16 గంటల వరకు నావిగేషన్ వరకు పని చేస్తుంది. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు.. 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఇతర డివైస్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
50MP AI కెమెరా:
ఫోటోగ్రఫీ కోసం 50MP AI ప్రైమరీ కెమెరాను అందించారు. ఇది AI సీన్ డిటెక్షన్ ద్వారా పరిస్థితులకు అనుగుణంగా కెమెరా సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారతాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ప్రీమియం డిజైన్:
8000mAh బ్యాటరీ ఉన్నప్పటికీ ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌తో వచ్చింది. మెటాలిక్ ఫినిష్ మిడిల్ ఫ్రేమ్, మ్యాట్ బ్యాక్ ప్యానెల్ మొబైల్ కు ప్రీమియం లుక్‌ను అందిస్తాయి. ముందు భాగంలో Corning Gorilla Glass 7i రక్షణ ఉండగా.. IP65 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో సాధారణ నీటి చినుకులు, దుమ్ము నుంచి రక్షణ లభిస్తుంది.
Android 16తో HyperOS 3:
పోకో M8 పవర్ 5Gలో ఆండ్రాయిడ్ 16 ఆధారిత Xiaomi HyperOS 3 అందించారు. ఈ ఫోన్‌కు 4 Android OS అప్డేట్స్, 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ధర, లభ్యత
ఈ కొత్త మొబైల్ 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999, 8GB + 128GB వేరియంట్ ను రూ.27,999గా నిర్ణయించారు. బ్యాంక్ ఆఫర్లు, లాంచ్ డిస్కౌంట్లతో ప్రారంభ ధర రూ.21,999కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ లో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఇక ఆఫర్స్ లో భాగంగా.. తొలి 12 గంటల పాటు రూ.1,000 కూపన్ డిస్కౌంట్, రూ.2,000 ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ లేదా ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది.
POCO M8 Power 5G స్పెసిఫికేషన్స్:
* 6.99-అంగుళాల FHD+ OLED డిస్ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్
* Qualcomm Snapdragon 4 Gen 4 (4nm)
* Adreno 613 GPU
* 6GB/8GB LPDDR4X RAM
* 128GB UFS 2.2 స్టోరేజ్ (microSD ద్వారా విస్తరించవచ్చు)
* Android 16 ఆధారిత HyperOS 3
* 50MP AI రియర్ కెమెరా
* 8MP ఫ్రంట్ కెమెరా
* ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్
* డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, Dolby Atmos
* IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
* 5G, Wi-Fi 6, Bluetooth 5.1, USB Type-C
* 8000mAh బ్యాటరీ
* 45W ఫాస్ట్ ఛార్జింగ్
* 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!