నిజమాబాద్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వర్నిలో ఎన్టీఆర్ క్యాంస విగ్రహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 1949లో మనదేశంతో ఎన్టీఆర్ సీనీ రంగప్రవేశం చేశారన్నారు. 1982లో రాజకీయాల్లోకి వచ్చి ప్రభంజనం సృష్టించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నవారిలో సగం మంది ఎన్టీఆర్ వారసులే అని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ రంగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు. ఉచిత కరెంటు ఘనత ఎన్టీఆర్‌దే అని ఆయన అన్నారు.
Rajinikanth: ఇది తమిళ శక్తి.. “సెంగోల్”పై కీలక వ్యాఖ్యలు.. ప్రధానికి ధన్యవాదాలు..
పార్టీలు వేరైనా ఎన్టీఆర్ వారసులమేనని, ఆయన స్పూర్తే మాకు ఆదర్శమన్నారు. మాకు ఏ పదవి వచ్చినా అది ఎన్టీఆర్ పెట్టిన భిక్షనే అని ఆయన అన్నారు. విపి సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో తాను ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యేవాడిని అని ఆయన అన్నారు. ఎన్టీఆర్ కు నిజమైన రాజకీయ వారసుడు కేసీఆర్ అని ఆయన అన్నారు. సుస్థిర పాలనతో అభివృద్ధి సాధ్యమన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.
Bandi Sanjay: 5 నెలల్లో ఎన్నికలు.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..