PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
- గ్రేటర్ నోయిడాలోని పీఎన్బీ శాఖలో భారీ మోసం
- ఖాతాదారుల అకౌంట్ల నుంచి మాయమైన సుమారు రూ.35 కోట్లు..
- ఫిక్స్డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాల నుంచి నగదు బదిలీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PNB Fraud: బ్యాంకుకు వెళ్లలేదు.. విత్‌డ్రాయల్ ఫారాలు నింపలేదు.. ఎలాంటి పేపర్లపై సంతకాలు చేయలేదు. కనీసం లావాదేవీలకు సంబంధించిన మెసేజ్‌లు కూడా రాలేదు. ఫిక్స్డ్ డిపాజిట్లు సహా అకౌంట్లలో దాచుకున్న కోట్లాది రూపాయలు రాత్రికి రాత్రే గాల్లో కలిసిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) శాఖలో వెలుగుచూసిన ఈ భారీ మోసం సంచలనం సృష్టిస్తోంది. ఈ శాఖలో దాదాపు రూ. 35 కోట్ల మేర నిధుల గోల్మాల్ జరిగినట్లు ప్రాధమికంగా గుర్తించినట్లు సమాచారం.
బాధితులు బ్యాంకుకు వెళ్లి ఖాతాల వివరాలు తనిఖీ చేసుకున్న తర్వాతే తాము మోసపోయామని గ్రహించారు. విజేంద్ర సింగ్ అనే ఖాతాదారుడి ఖాతాలో గతంలో సుమారు రూ. 87 లక్షలకు పైగా ఉండగా.. ప్రస్తుతం అందులో కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే మిగిలాయి. మరో ఖాతాదారుడి ఖాతా నుంచి రూ. 39 లక్షలు, మరొకరి అకౌంట్ నుంచి రూ. 9.5 లక్షలు మాయమయ్యాయి. ఇలా పలువురి డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాల నుంచి భారీగా నగదు బదిలీ అయినట్లు తేలింది. ఈ అక్రమ లావాదేవీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఖాతాదారులు బ్యాంకు ఎదుట నిరసనకు దిగారు. తమ డబ్బు తమకు తిరిగి ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు యాజమాన్యం కూడా అంతర్గత విచారణ జరిపి.. బ్రాంచ్ మేనేజర్‌తో సహా ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసింది.
Also Read
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
- Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు సుమారు 18 మంది బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బ్యాంకు అంతర్గత విచారణతో పాటు అవినీతి నిరోధక విభాగానికి (ACB) కూడా ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఖాతాదారుల నగదును తిరిగి రాబట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని బ్యాంకు యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే జరిగిన మోసం రూ. 35 కోట్ల వరకే పరిమితమా లేక ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయా అనేది పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే స్పష్టత రానుంది.
తాజావార్తలు
-
PNB Fraud: పీఎన్బీలో భారీ కుంభకోణం.. ఖాతాదారులకు తెలియకుండానే రూ.35 కోట్లు మాయం.!
-
Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
-
AP Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ.. 48 ప్రతిపాదనలకు ఆమోదం.. స్థానిక ఎన్నికలపై సీఎం కీలక సూచనలు!
-
PM Kisan 24th Installment 2026: PM-KISAN 24వ విడత.. రైతుల ఖాతాల్లోకి రేపే రూ.2,000.. ఈసారి ప్రత్యేకత ఏంటంటే?
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
ట్రెండింగ్
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!
-
RCB Full Squad: నలుగురు కొత్త ప్లేయర్లు, స్టార్ ఆల్‌రౌండర్లు.. ఆర్సీబీ ఫుల్ స్క్వాడ్ ఇదే!