Site icon NTV Telugu

PM Viksit Bharat Rozgar Yojana: కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి వరం ఈ పథకం.. ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు

Pm Viksit Bharat

Pm Viksit Bharat

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తు్న్నాయి. దీనిలో భాగంగా స్కిల్ సెంటర్స్ ఏర్పాటు, ఆర్థిక చేయూతనందించే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం ఉంది. అదే పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన. ఈ పథకం ద్వారా కొత్తగా ఉద్యోగంలో చేరే వారు ఉచితంగా రూ. 15 వేలు పొందొచ్చు. ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకం ‘పీఎం వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దేశంలో ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం అని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also Read:Russia Earthquake: సునామీ కారణంగా ఒడ్డుకు కొట్టికొచ్చిన భారీ తిమింగలాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఇటీవల ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనకు ఆమోదం తెలిపింది. రూ. 99,446 కోట్ల బడ్జెట్‌తో, PMVBRY రెండేళ్లలో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుందని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 1.92 కోట్ల మంది లబ్ధిదారులు తొలిసారిగా ఉద్యోగాల్లో చేరనున్నారు. ఈ పథకం ఆగస్టు 1, 2025, జూలై 31, 2027 మధ్య సృష్టించబడే ఉద్యోగాలకు వర్తిస్తుంది. ఆగస్టు 1 నుంచి ఈ పథకం అందుబాటులోకి రానుండగా కొత్తగా ఈపీఎఫ్ఓ లో రిజిస్టర్ చేసుకున్న ఉద్యోగులకు 15వేలు కేంద్రం జమ చేస్తుంది. రెండు విడుతలుగా పదిహేను వేలను బెనిఫీషియర్ అకౌంట్ లో జమ చేస్తామని అధికారులు తెలిపారు.

Also Read:CBI arrests IT Inspector: రూ.5 లక్షలు డిమాండ్‌.. లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన ఐటీ ఇన్‌స్పెక్టర్..

ఈ పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు. పార్ట్-ఎ మొదటిసారిగా శ్రామిక శక్తిలో చేరే ఉద్యోగులపై దృష్టి పెడుతుంది. పార్ట్-బి యజమానులపై దృష్టి పెడుతుంది. పార్ట్-ఎ కింద, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో మొదటిసారి నమోదు చేసుకునే ఉద్యోగులకు రూ. 15,000 వరకు EPF జీతం అందిస్తుంది. నెలకు రూ. లక్ష వరకు జీతం ఉన్న ఉద్యోగులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలను పొందగలరు. ఈ పథకం కింద అన్ని చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) మోడ్ ద్వారా చేయబడతాయి. పార్ట్-బి కింద, చెల్లింపులు యజమానుల పాన్‌తో అనుసంధానించబడిన ఖాతాకు నేరుగా జమ అవుతాయి.

Exit mobile version