PM Svanidhi Yojana : మీరు ఒక చిన్న వ్యాపారా. వర్కింగ్ క్యాపిటల్ కోసం మీకు అత్యవసరంగా డబ్బు కావాలా. ఎవరినీ అడిగినా మీకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదా. పోనీ సాక్షిగా ఉండమన్నా ఉండడం లేదా.. మీకు రుణం తీసుకోవడం కష్టం కావచ్చు. మీరు స్థానిక వడ్డీ వ్యాపారులకు లేదా ఏదైనా మైక్రో ఫైనాన్స్ కంపెనీకి వెళితే, మీరు అధిక వడ్డీకి భయంకరమైన రుణాల వలయంలో చిక్కుకోవచ్చు. అయితే మీరు చింతించాల్సిన పనిలేదు. మీకు ఎవరీ హామీ అక్కర్లేదు. భారత ప్రభుత్వ రుణ పథకం మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. ఈ లోన్ స్కీమ్ కోసం మీరు గ్యారంటీగా ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఆధార్ కార్డును చూపించడం ద్వారా మీరు తక్షణ రుణాన్ని పొందవచ్చు. అది కూడా మూడు విడతల్లో రూ.80 వేల వరకు అందుకోవచ్చు. దీన్ని తిరిగి చెల్లించడానికి, చాలా తక్కువ వడ్డీ రేట్లకు సులభమైన వాయిదాలను నిర్ణయించారు. మొదటి సారి చిన్న వ్యాపారాన్ని ప్రారంభించే వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోడ్డు పక్కన దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారి వర్కింగ్ క్యాపిటల్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ పథకం నమూనాను రూపొందించారు. ఈ పథకం పేరు పీఎం స్వానిధి యోజన.
Read Also:Suriya : ప్రభాస్‌ను ఫాలో అవుతోన్న తమిళ హీరో సూర్య
ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ లోన్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే, మీకు వర్కింగ్ క్యాపిటల్‌గా రూ.10,000 లభిస్తుంది. దాన్ని తిరిగి చెల్లించిన వెంటనే రెండో విడతగా రూ.20 వేలు రుణంగా అందుతుంది. తర్వాత రెండో విడత చెల్లించగా మూడో విడత రూ.50 వేలు అందుతాయి.
1200 రూపాయల వార్షిక క్యాష్‌బ్యాక్ కూడా
ప్రధానమంత్రి స్వానిధి యోజన కింద ఏడు శాతం వడ్డీ రాయితీ కూడా ఇస్తారు. ఇది కాకుండా, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి, ఏటా రూ.1200 క్యాష్ బ్యాక్ కూడా అందించబడుతుంది. పథకం ప్రయోజనాలు పట్టణ సంస్థల ద్వారా పొందబడతాయి. దరఖాస్తు ప్రక్రియ కూడా అక్కడే పూర్తి చేయాల్సి ఉంటుంది.
Read Also:USA- Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు.. తాజా పరిస్థితులపై అమెరికా ఆరా..!