PM Svanidhi Yojana: ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ఓ శుభవార్త. ఇప్పుడు మీరు కేవలం ఆధార్ కార్డు ఆధారంగా, ఎటువంటి అదనపు డాక్యుమెంట్ల అవసరం లేకుండా, అతి తక్కువ కాలంలోనే రూ.50,000 వరకు లోన్ పొందవచ్చు. ఇది భారత ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన (PM Svanidhi Yojana) స్కీమ్ ద్వారా అందించబడుతుంది. మరి ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందామా..
ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందించే విధంగా రూపొందించబడింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి, రోడ్డు ప్రక్కన వ్యాపారం చేసే వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీమ్ క్రింద మీరు మూడు దశల్లో లోన్ పొందవచ్చు. మరి అవేంటంటే..?
Also Read: IND vs ENG 2nd ODI: రెండో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
మొదటి దశ:
ఈ దశలో మీరు రూ.10,000 వరకు లోన్ పొందవచ్చు. ఈ మొత్తాన్ని నిర్దిష్ట కాలంలో తిరిగి చెల్లించాలి.
రెండవ దశ:
మీరు మొదటి దశలో పొందిన రుణాన్ని సమయానికి తిరిగి చెల్లిస్తే, తదుపరి దశలో రూ. 20,000 వరకు రుణం పొందవచ్చు.
మూడవ దశ:
రెండవ దశలో రుణాన్ని విజయవంతంగా చెల్లించిన వారికి, రూ. 50,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణం పొందేందుకు ఎలాంటి భద్రత (సెక్యూరిటీ) అవసరం లేదు.
Also Read: Viral Video: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 23 ఏళ్ల యువతి..
మరి ఈ లోన్ కోసం ఎలా అప్లై చేయాలన్న విషయానికి వస్తే.. మీకు సమీపంలోని ప్రభుత్వ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సందర్శించండి. ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన దరఖాస్తును పొందండి. దరఖాస్తు ఫారాన్ని సరైన సమాచారంతో నింపి సమర్పించండి.
https://pmsvanidhi.mohua.gov.in/LoginThirdLoanTerm అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి.. అక్కడ మీ ఆధార్ కార్డు వివరాలు, ఇతర అవసరమైన సమాచారాన్ని అప్‌డేట్ చేయండి. ఈ ఫారం పూర్తి చేసే సమయంలో గుర్తుంచుకోవాలిసిన వివరాలు చూస్తే.. మీ ఆధార్ కార్డు సరైన సమాచారంతో అప్‌డేట్ అయ్యి ఉండాలి. ఆధార్ కార్డు లింక్ చేయబడిన మొబైల్ నంబర్ మీ వద్ద ఉండటం అవసరం. ఏ చిన్న పొరపాటు జరగకుండా దరఖాస్తును నింపడం చాలా ముఖ్యమైనది.
ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన ద్వారా చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి అభ్యర్థులు ఆధార్ కార్డు ఆధారంగా రూ. 50,000 వరకు రుణం పొందే అవకాశం ఉంది. మీరు ఈ పద్ధతిని ఉపయోగించి మీ వ్యాపార అవసరాలకు తక్షణ ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ అద్భుతమైన అవకాశం నుండి మీరెందుకు వదులుకోవాలి? ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి!