PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM SVANidhi Credit Card: స్ట్రీట్ వెండర్స్, అంటే రోడ్ల పక్కన మోమోస్, పానీపూరి, సమోసాలు అమ్మే చిన్న వ్యాపారుల నుంచి చంపారణ్ చికెన్ స్టాల్ నడిపే వారి వరకు అందరికీ కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు కేవలం ఉద్యోగులు, ఐటి ఉద్యోగులు లేదా కాస్త ఉన్నత వర్గాల చేతుల్లో మాత్రమే కనిపిచే ‘క్రెడిట్ కార్డ్’ ఇకపై మన వీధి వ్యాపారుల చేతుల్లో కూడా కనిపించనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనసామాన్యం కోసం మరొక గొప్ప అవకాశాన్ని అందించారు. వీధి వ్యాపారుల కోసం ఇప్పటికే అమలులో ఉన్న ‘పీఎం స్వనిధి’ పథకంలో భాగంగా ఇప్పుడు కొత్తగా ‘పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్’ (PM Credit Card) ని లాంచ్ చేశారు. వ్యాపారానికి సంబంధించి రోజూ అయ్యే చిన్న చిన్న ఖర్చుల కోసం ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. వీధి వ్యాపారులు బయట వడ్డీ వ్యాపారులు, దళారుల బారిన పడి అధిక వడ్డీలు కట్టలేక నష్టపోకుండా చూడటానికి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో వ్యాపారులకు గ్యారెంటీ లేకుండా 50 వేల రూపాయల వరకు రుణం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ సౌకర్యానికి అదనంగా ఈ క్రెడిట్ కార్డ్ ఫీచర్‌ను కూడా జోడించారు.
ఈ పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ ఎలా పనిచేస్తుంది?
ఈ పథకం కింద రూపే (RuPay) క్రెడిట్ కార్డును అందిస్తారు. మిగతా సాధారణ క్రెడిట్ కార్డుల లాగే ఇది కూడా పనిచేస్తుంది. కార్డు ద్వారా వాడిన డబ్బును 20 నుంచి 50 రోజుల లోపు తిరిగి చెల్లిస్తే రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ మొదట్లో రూ. 10,000 లిమిట్‌తో వస్తుంది, ఆ తర్వాత ఆ పరిమితిని రూ. 30,000 వరకు పెంచుకోవచ్చు. దీని చెల్లుబాటు వ్యవధి 5 సంవత్సరాలు. ఇక పేమెంట్లు సులభంగా చేయడానికి ఈ కార్డును యూపీఐ (UPI) ఐడీకి లింక్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ అయ్యే సరుకుల బిల్లులను దీని ద్వారా చెల్లించవచ్చు. ఒకవేళ బిల్లు ఎక్కువైతే కనీసం రూ. 2,500 కంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని ఈఎంఐ (EMI)గా కూడా మార్చుకోవచ్చు. దీనిపై పడే వడ్డీ కూడా నెలకు 1.5 శాతం కంటే ఎక్కువ ఉండదు. క్రమంతప్పకుండా డబ్బులు చెల్లించే వ్యాపారులకు బ్యాంకర్లతో మంచి నమ్మకం ఏర్పడి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఇది ఒక దీర్ఘకాలిక పరిష్కారంగా తోడ్పడుతుంది.
Also Read
- Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
- CM Chandrababu Foreign Trip: ఫ్యామిలీతో సీఎం చంద్రబాబు విదేశీ టూర్.. 3 రోజుల వ్యక్తిగత పర్యటన..
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
ఎవరెవరు ఈ కార్డుకు అర్హులు?
పీఎం స్వనిధి పథకం కింద రెండవ దఫా తీసుకున్న రుణాన్ని సమయానికి చెల్లించి, మూడవ దఫా రుణం పొందడానికి అర్హత సాధించిన వ్యాపారులు లేదా ఇప్పటికే మూడవ దఫా రుణం తీసుకున్న వారు ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయస్సు 21 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే గతంలో ఏ రుణం లేదా క్రెడిట్ కార్డు విషయంలో డిఫాల్ట్ (ఎగవేతదారులు) అయి ఉండకూడదు.
అప్లై చేసుకోవడం ఎలా?
అర్హత ఉన్నవారు పీఎం స్వనిధి అధికారిక పోర్టల్ (pmsvanidhi.mohua.gov.in) ద్వారా కానీ లేదా PMS మొబైల్ యాప్ ద్వారా కానీ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పోర్టల్‌లోకి వెళ్లాక ‘Apply for Credit Card’ పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్, ఓటీపీ (OTP)తో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ కార్డ్ ఉందో లేదో తెలియజేసి, మూడు వెండర్ కేటగిరీల్లో మీ కేటగిరీని ఎంచుకుని రిజిస్ట్రేషన్ నంబర్‌తో వెరిఫై చేయాలి. ఫారమ్‌లో అడిగిన వివరాలు నింపి కావలసిన పత్రాలు అప్లోడ్ చేయాలి. మీకు ఆల్రెడీ ఖాతా ఉన్న బ్యాంకునే ఎంచుకోవడం మంచిది. ఒకవేళ ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఇవ్వకపోతే వేరే బ్యాంక్‌ను ఎంచుకోవచ్చు. దరఖాస్తు ప్రాసెస్ పూర్తి కావడానికి ఆధార్ నంబర్ ద్వారా బయోమెట్రిక్ ఈ-కేవైసీ (eKYC) చేయడం తప్పనిసరి.
కావాల్సిన డాక్యుమెంట్లు:
ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వెండింగ్ సర్టిఫికేట్ (CoV) లేదా లెటర్ ఆఫ్ రికమండేషన్ (LoR) లేదా స్థానిక మున్సిపల్/బ్లాక్ ఆఫీస్ ఇచ్చిన ఐడీ కార్డ్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ నంబర్, మీ ప్రస్తుత నివాస ధృవీకరణ పత్రం (ఆధార్‌లో ఉన్న అడ్రస్ కంటే వేరే చోట ఉంటే). అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి అదే పోర్టల్‌లో ‘Know Your Application Status’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, ఓటీపీ సాయంతో స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. ఇక, ఈ పీఎం స్వనిధి క్రెడిట్ కార్డ్ కేవలం వ్యాపార అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. మద్యం కొనడం, విదేశీ ప్రయాణ టికెట్లు బుక్ చేయడం, కార్లు అద్దెకు తీసుకోవడం, ఇంటర్నేషనల్ హోటల్ బుకింగ్స్ లేదా డిజిటల్ బిజినెస్ ఖర్చుల కోసం దీనిని వాడకూడదు. ఎక్కడెక్కడ వాడకూడదో తెలిపే పూర్తి జాబితా పోర్టల్‌లోని ‘MCC Restriction’ (Annexure 1) లో అందుబాటులో ఉంటుంది.ఈ కార్డుకు ఎలాంటి వార్షిక లేదా ఆరంభ రుసుములు ఉండవు, ఇది లైఫ్‌టైమ్ ఉచిత క్రెడిట్ కార్డ్. దీని ద్వారా విదేశీ లావాదేవీలు చేయడానికి వీలుండదు, కేవలం దేశీయ అవసరాలకే ఉపయోగించాలి. బిల్లింగ్ తేదీ అనేది మీరు ఎంచుకున్న బ్యాంక్ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ చెల్లింపు ఆలస్యమైతే, పెండింగ్ బిల్లు రూ. 500 లోపు ఉంటే ఎలాంటి లేట్ ఫీజు పడదు. అంతకంటే ఎక్కువ మొత్తానికి బ్యాంక్ నిబంధనల ప్రకారం లేట్ ఫీజు వర్తిస్తుంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
-
India vs Japan: చివరి ఓవర్ థ్రిల్లర్.. జపాన్ను భారత్ ‘చీటింగ్’ చేసిందా?
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!