PM Modi: ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టిన రోజు సందర్భంగా దేశ, విదేశీ నేతలు శుభాకాంక్షలు చెబుతున్నారు. పుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. విజన్ ఉన్న నాయకుడు, భారతదేశ ముద్దుబిడ్డ అంటూ విషెస్ చెప్పారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా ప్రధాని మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోడీకి నా పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఆయనకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షును కోరుకుంటున్నాను’’ అని అన్నారు. ‘‘ప్రధాని మోడీ నాయకత్వంలో, భారతదేశం ఆర్థికంగా అగ్రరాజ్యంగా ఎదుగుతోంది, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే తన సంకల్పాన్ని నెరవేర్చే శక్తిని నేను కోరుకుంటున్నాను. భారత్ 5 ట్రిలియన్ల ఎకానమిగా మారేందుకు ప్రధాని మోడీ సంకల్పాన్ని నెరవేర్చడానికి మహారాష్ట్ర కూడా అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. 21వ శతాబ్ధం, భారత శతాబ్ధం ఎందుకంటే దేశానికి కెప్టెన్‌గా ఉన్నది ప్రధానిమోడీ’’ అని షిండే అన్నారు.
Read Also: Big Breaking: ఖైరతాబాద్ గణేష్ విగ్రహం వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆందోళన..
ప్రధానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఇతర రాజకీయ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోడీ పుట్టిన రోజుని ‘‘సేవా పర్వ్’’గా బీజేపీ నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17, 1950న గుజరాత్‌లోని మెహసానా పట్టణంలో జన్మించిన నరేంద్ర దామోదరదాస్ మోడీ అంచెలంచెలుగా ఎదిగి గుజరాత్ ముఖ్యమంత్రి, దేశ ప్రధానిగా అత్యున్నత స్థానాలను అధిరోహించారు. సాధారణ చాయ్ వాలా నుంచి దేశానికి అధినేత అయ్యారు. వరసగా మూడుసార్లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు తీసుకున్నారు.
ప్రధాని తన 74వ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం భువనేశ్వర్‌లో గడకానాలో 26 లక్షల పీఎం ఆవాస్ ఇళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. భువనేశ్వర్‌లో పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారులతో ముచ్చటించనున్నారు. అనంతరం జనతా మైదాన్లో సుభద్ర యోజన పథకాన్ని ప్రారంభించనున్నారు. సుభద్ర యోజన కింద ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా పేద మహిళలకు ఐదు సంవత్సరాల పాటు రెండు సమాన వాయిదాలలో ఏడాదికి రూ. 10,000 ఆర్థిక సాయం అందనుంది. జగన్నాథుని సోదరి అయిన సుభద్ర దేవి పేరు మీద ఆర్థిక సహాయ పథకం ప్రారంభించనున్నారు.