NTV Telugu Site icon

PM Modi: కువైట్ ప్రమాదంపై అధికారులతో మోడీ సమీక్ష

Mdke

Mdke

ఏపీ, ఒడిశా పర్యటనలు ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని్ప్రమాదానికి గల కారణాలపై అధికారులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్‌ల ద్వారా వివరించారు.

ఇది కూడా చదవండి: Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతానికి పాకిస్థాన్‌తో చర్చలే ఏకైక మార్గం

బుధవారం తెల్లవారుజామున కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది మృతిచెందగా.. 40 మంది భారతీయులు సజీవదహనం అయ్యారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలిసింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కుటుంబాలకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. మూడు రోజుల్లో నాల్గోది..

10 అంతస్తుల బిల్డింగ్‌లో వంట గది నుంచి తొలుత మంటలు ఎగిసిపడ్డాయి. అనంతరం మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఇక ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఐదో అంతస్తు నుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 49 మంది చనిపోగా.. ఇంకా 40 మంది ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.