NTV Telugu Site icon

PM Modi: సింగపూర్ పర్యటన విజయవంతమైంది: ప్రధాని మోడీ

Modi

Modi

PM Narendra Modi arrives in Delhi after concluding his three day visit to Singapore and Brunei: మూడు రోజుల సింగపూర్, బ్రూనై పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం అర్థరాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోడీ తన సింగపూర్ పర్యటన వీడియోను పంచుకున్నారు. ఇందులో భాగంగా నా సింగపూర్ పర్యటన చాలా విజయవంతమైంది.. ఇది ఖచ్చితంగా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది.. రెండు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. సింగపూర్ ప్రభుత్వానికి, ప్రజలకు వారి ఆప్యాయతకు ధన్యవాదాలని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.

Rape: ఛీ.. ఛీ.. పట్టపగలు రోడ్డు పక్కన మహిళపై అత్యాచారం..

అంతకుముందు సింగపూర్ పార్లమెంట్ హౌస్‌లో ప్రధాని మోడీ, సింగపూర్ పీఎం లారెన్స్ వాంగ్ భేటీ అయ్యారు. ఇరువురు నేతలు తమ ప్రతినిధులతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. తమ సంభాషణలో ఇరువురు నేతలు భారత్ – సింగపూర్ ద్వైపాక్షిక సంబంధాల పురోగతిని సమీక్షించారు. ఆ తర్వాత.. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ సర్వీసెస్ రంగాలలో ఇరుపక్షాలు నాలుగు అవగాహన ఒప్పందాలను మార్చుకున్నాయి. ప్రధాని మోడీ ప్రధాని లారెన్స్ వాంగ్‌ను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించగా ఆయన అంగీకరించారు.

Marathan Runner : పారిస్ ఒలింపిక్ క్రీడాకారిణి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి

సింగపూర్‌లోని AEM హోల్డింగ్స్ లిమిటెడ్ సెమీకండక్టర్ సౌకర్యాన్ని కూడా ప్రధాని మోడీ సందర్శించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ కూడా పాల్గొన్నారు. సెప్టెంబర్ 11-13 వరకు గ్రేటర్ నోయిడాలో జరగనున్న సెమికాన్ ఇండియా ఎక్స్‌పోలో పాల్గొనాల్సిందిగా సింగపూర్ సెమీకండక్టర్ కంపెనీలను ప్రధాని మోడీ ఆహ్వానించారు. సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మన్ షణ్ముగ రత్నంతో కూడా ప్రధాని భేటీ అయ్యారు. ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణలో భారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి సారించారు.

Show comments