ప్రధాని నరేంద్ర మోడీ పరీక్షా పే చర్చ 7వ ఎడిషన్ కోసం దరఖాస్తులను త్వరలోనే ఆహ్వనించనున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో రెండు గంటల పాటు ప్రధాని మోడీ చర్చించనున్నారు. పరీక్ష సమయంలో ఒత్తిడిని ఎలా అధిగమించాలో వారికి ఆయన సలహా ఇవ్వనున్నారు. ఒత్తిడిని ఎలా జయించాలి.. టైమ్ మేనేజ్‌మెంట్, మెరుగైన హార్డ్ వర్క్ లేదా స్మార్ట్ వర్క్ ఏమిటి, పరీక్షల్లో చీటింగ్‌ను ఎలా ఎదుర్కోవాలి అనే ప్రశ్నలకు ప్రధాని సమాధానం ఇవ్వనున్నారు. ఈ ప్రశ్నలకు పరీక్షా పే చర్చా అనేది రాబోయే బోర్డు పరీక్షకు హాజరయ్యే విద్యార్థులతో మోడీ సంభాషించే వార్షిక కార్యక్రమం.. ఈ సందర్భంగా, పరీక్షల ఒత్తిడితో పాటు ఇతర సమస్యలకు సంబంధించిన విద్యార్థుల సందేహాలకు కూడా ప్రధాని మోడీ సమాధానమిస్తారు.
Read Also: Navdeep Saini Marriage: ప్రేయసిని పెళ్లాడిన టీమిండియా క్రికెటర్!
ఇక, ప్రతి సంవత్సరం పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహింది. ఈ ఏడాది కూడా త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. మరికొద్ది రోజుల్లో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లు విడుదలయ్యే అవకాశం ఉంది. గతేడాది కూడా నవంబర్ చివరి వారంలో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. దీంతో త్వరలో దరఖాస్తు ఫారాలను విడుదల చేసే అవకాశం ఉంది. విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు ఫారమ్ విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mygov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రధాని మోడీతో కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంటుంది.
Read Also: Punjab: చెరకు ధరలు పెంచాలని.. రోడ్లు, రైల్వే ట్రాక్‌పై టెంట్లు వేసి రైతుల నిరసన
అయితే, ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల పట్ల ఉన్న భయం నుంచి బయట పడేయడంతో పాటు వారికి సంబంధించిన పలు అంశాలపై ప్రధాని మోడీ చర్చించనున్నారు. మరోసారి పరీక్షా పే చర్చ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా My Gov.In అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైన తర్వాత మీరు హోమ్‌పేజీలో అందుబాటులో ఉన్న పార్టిసిపేట్ నౌ లింక్‌పై క్లిక్ చేయాలి. .ఇప్పుడు ఖాతాలోకి లాగిన్ అవ్వండి.. ఆ తర్వాత అన్ని వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసి సమర్పించాలి.. ఆ తర్వాత తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచుకోండి.