Site icon NTV Telugu

PM Modi: ఒడిశా సీఎంకు జిల్లాల పేర్లు తెలుసా? నవీన్ పట్నాయక్‌కు సవాల్

Mdodi

Mdodi

దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తీరికలేకుండా ప్రచారం సాగిస్తున్నారు. శనివారం ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ.. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇది కూడా చదవండి: Road Accident: పశ్చిమ బెంగాల్‌లో ఘోరం.. అదుపుతప్పి జనాలపైకి దూసుకెళ్లిన ట్రక్కు, ఐదుగురు మృతి

స్క్రిప్ట్స్ సహాయం లేకుండా ఒడిశాలోని అన్ని జిల్లాల పేర్లు చెప్పగలరా అని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రధాని మోడీ సవాలు విసిరారు. ఒడిశాలోని కంధమాల్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని మాట్లాడారు. తాను చేస్తున్న ఈ ఛాలెంజ్ నవీన్ పట్నాయక్‌కు ఓ ముఖ్యమంత్రిగా రాష్ట్రం గురించి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుపుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కాగితాలు చూడకుండా ఒడిశాలోని జిల్లాల పేర్లు, వాటి కేంద్రాల పేర్లు చెప్పమనండని సవాల్ విసిరారు.. పేర్లనే చెప్పలేకపోతే ఇక మీరు పడుతున్న బాధను ఎలా తెలుసుకుంటారని మోడీ ప్రజలను ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Pawan kalyan: కాలికి గాయం.. నడవలేకపోతున్న పవన్ కళ్యాణ్!!

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరుస్తానని మోడీ హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికలు ఒడిశా అభివృద్ధికి ఎంతో కీలకమైనవని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్ష వంటి చారిత్రాత్మక సంఘటనలను ఉటంకిస్తూ ప్రధాని భారత దేశ సార్థ్యాన్ని కొనియాడారు. 26 సంవత్సరాల క్రితం, అటల్ బిహారీ వాజ్‌పేయీ పోఖ్రాన్ పరీక్షను నిర్వహించారన్నారు. ఈ అణు పరీక్ష ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను గర్వంగా తలెత్తుకునేలా చేసిందని తెలిపారు. భారత్‌ మొదటిసారిగా తన సామర్థ్యాలను ప్రపంచానికి తెలిపిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌ నేతలు పాకిస్థాన్‌ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, దాన్ని మనం గౌరవించాలని చెబుతున్నారని విమర్శించారు. పాక్‌ పేరు చెప్పి సొంత ప్రజలనే భయపెట్టాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని మోడీ ధ్వజమెత్తారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసింది. నాల్గో విడత మే 13న జరగనుంది. అనంతరం మే 20, 25, జూన్ 1న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి.

ఇది కూడా చదవండి: PM Modi: కాంగ్రెస్ కనీసం 50 సీట్లను కూడా గెలుచుకోలేదు..ప్రతిపక్ష హోదా రాదు..

Exit mobile version