NTV Telugu Site icon

Cabinet Portfolios: కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు.. ఎవరికి ఏ శాఖ దక్కుతుందో..?

Portfolio Allocation

Portfolio Allocation

Portfolio Allocation: భారత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 72 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. అయితే, ఎవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. ఈ కేబినేట్ లో ప్రధాని మోడీ మార్క్ ఏమైనా కనిపించబోతుందా?. ఇవాళ( జూన్‌ 10) సాయంత్రం 5 గంటలకు ప్రధాని నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం సమావేశం కాబోతుంది. ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓ క్లారిటీ రానుంది. భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖలను అన్నింటిని పరిగణలోకి తీసుకున్న బీజేపీ.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే బీజేపీ అంటి పెట్టుకోనుంది.

Read Also: Diwali 2024: దీపావళికి కోలీవుడ్ భారీ క్లాష్‌..ఏకంగా ఇద్దరు సూపర్ స్టార్స్..!

అలాగే.. మూడోసారి ఏర్పాడిన ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక వసతులపై ప్రధానంగా ఫోకస్ ఉంటుందని గతంలోనే మోడీ ప్రకటించారు. దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ తమ దగ్గరే పెట్టుకునే ఛాన్స్ ఉంది. మంత్రి వర్గ కూర్పులో ప్రధాని మోడీ కుల సమీకరణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ఎన్నికలు జరగాల్సి ఉన్న రాష్ట్రాలకూ సైతం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, కొత్త మంత్రుల్లో 27 మంది బీసీలు ఉండగా.. ఐదుగురు మైనారిటీలు, ఏడుగురు మహిళలు, యువత, సీనియర్ల కాంబినేషన్‌లో మోడీ మార్క్‌తో మంత్రులకు శాఖలు కేటాయింపు ఉంటుందని సమాచారం.

Read Also: Maharastra : కేంద్ర మంత్రి పదవిని తిరస్కరించిన ఎన్సీపీ..మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఊహాగానాలు

కాగా, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్య పార్టీలు సైతం తమ ప్రయోజనాలను దృష్ట్యిలో ఉంచుకుని ఆయా శాఖల్ని డిమాండ్‌ చేస్తున్నాయి. వ్యవసాయ శాఖను జేడీఎస్‌ నేత కుమారస్వామి కోరినట్లు సమాచారం. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే శాఖల్ని కోరామని మరో మిత్రపక్షం టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే, జేడీయూ, ఇతర పార్టీలు సైతం పలు ముఖ్య శాఖల్ని కోరినట్లు తెలుస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్డీయే ఎంపీల సమావేశం జరుగుతున్న సమయంలోనే.. మరోవైపు జేపీ నడ్డా నివాసంలో మిత్రపక్ష నేతలతో మంత్రివర్గ కూర్పు, ఎవరికి ఏయే శాఖలు లాంటి అంశాలపై చర్చించి ఓ నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం.

Read Also: Narsingi Kidnap Case: నార్సింగి వ్యాపారవేత్త కిడ్నాప్‌ కేసు.. అసలు కథ ఇదీ..

ఇక, ఆదివారం రాత్రి మోడీతో పాటు మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. మోడీ 3.0 సర్కార్ లో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 మంది స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేయగా.. ఇందులో 43 మంది మూడుసార్ల కంటే ఎక్కువసార్లు పార్లమెంట్‌కు ఎంపికయ్యారు. అలాగే, ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులను సైతం కేంద్రమంత్రివర్గంలోకి మోడీ తీసుకున్నారు. అలాగే.. తెలుగు రాష్ట్రాల తరఫున తెలంగాణ నుంచి ఇద్దరు, ఏపీ నుంచి ముగ్గురి మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. ఇక, కేంద్ర కేబినెట్‌లో ఇంకా 9 బెర్తులు ఖాళీగా ఉన్నాయి.