నేడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12 గంటలకు వికాస్ భారత్ సంకల్ప యాత్ర లబ్ధిదారులతో వర్చువల్ గా మాట్లాడబోతున్నారు. వికాస్ భారత్ సంకల్ప యాత్రతో పాటు నడుస్తున్న ప్రచార రథాల్లో ప్రధాని నేరుగా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుభాష్ యదువంశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, పార్టీ అధికారులు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, సభ్యులు, బ్లాక్ హెడ్‌లు, గ్రామపెద్దలు, స్థానిక పౌరులతో పాటు ప్రజా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశం ఉంది.
Read Also: OTT Release Movies: సంక్రాంతి కానుకగా ఈ వారం ఓటీటీలో 29 సినిమాలు రిలీజ్.. ఏ సినిమా ఎక్కడంటే?
అయితే, నవంబర్ 15, 2023న ప్రారంభించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ లబ్ధిదారులతో ప్రధాన మంత్రి మోడీ క్రమం తప్పకుండా మాట్లాడుతున్నారు.. ఈ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు నాలుగు సార్లు జరిగింది. ఇదే కాకుండా, గత నెలలో వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి వరుసగా రెండు రోజులు (డిసెంబర్ 17-18 తేదీలలో) ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ లబ్ధిదారులతో ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రధాన పథకాలలో సంపూర్ణతను సాధించే లక్ష్యంతో ‘వికాస్ భారత్ సంకల్ప యాత్ర’ దేశవ్యాప్తంగా చేపట్టబడుతోంది. ఈ పథకాల ద్వారా ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సకాలంలో చేరేలా చూస్తారు.
Read Also: Jeff Bezos: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో చేరిన అమెజాన్ వ్యవస్థాపకుడు
అలాగే, ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్రలో దాదాపు 10 కోట్ల మందికి పైగా జనం పాల్గొన్నారు. ఇది ప్రారంభమైన 50 రోజుల్లోనే అద్భుతమైన రికార్ట్ సృష్టించింది.. ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే ఉమ్మడి దృక్పథంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలను ఏకం చేయడంలో ఈ యాత్రపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని ప్రధాని మోడీ తెలియజేశారు.