నేడు (సోమవారం) ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 90 ఏళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడనున్నారు. ఇక, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా పాల్గొంటారు. ఈరోజుల్లో ప్రధాని మోడీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయన నిరంతరం బహిరంగ సభలు నిర్వహిస్తూ తన ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఇక, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1 ఏప్రిల్ 1935న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం, 1934 ప్రకారం స్థాపించబడింది.
Read Also: Kejriwal: నేటితో ముగియనున్న కేజ్రీవాల్ ఈడీ కస్టడీ..
ఇక, 1 జనవరి 1949న జాతీయం చేయబడింది. ఈ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అయితే, రూపాయి మారకం విలువ స్థిరత్వాన్ని కాపాడుకోవడంలో ఆర్బీఐ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో భారతదేశ సభ్యత్వానికి సంబంధించి ప్రభుత్వ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ వివిధ రకాల అభివృద్ధి, ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. ఇవి కాకుండా, రిజర్వ్ బ్యాంక్ భారత ప్రభుత్వ రుణ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది. అలాగే, భారతదేశంలో ఒక రూపాయి నాణేలు, నోట్లు కాకుండా ఇతర కరెన్సీని జారీ చేసే ఏకైక అధికారం రిజర్వ్ బ్యాంక్‌కి ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా, రిజర్వ్ బ్యాంక్ ఒక రూపాయి నోట్లు, నాణేలతో పాటు ప్రభుత్వం జారీ చేసే చిన్న నాణేలను కూడా చెలామణి చేస్తుంది.