NTV Telugu Site icon

Modi Tour: ఇవాళ్టి నుంచి తెలంగాణలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం..

Pm Modi

Pm Modi

Prime Minister Modi Tour In Telangana: తెలంగాణలో ఎన్నికల ప్రచారం చివర అంకానికి చేరుకోగా.. ప్రచారంలో అన్ని పార్టీల స్పీడ్ పెంచాయి. కాగా, నేడు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. నేడు కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో ప్రచారం చేయనున్నారు. ఇక, రేపు తుఫ్రాన్, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్నారు. అలాగే, ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో రోడ్డు షోలో మాట్లాడనున్నారు.

Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు వెండి ధర ఎంతంటే?

ప్రధాని మూడు రోజుల షెడ్యూల్:
* ఇవాళ మధ్యాహ్నం 1:25 గంటలకు దుండిగల్ విమానాశ్రయానికి ప్రధాని మోడీ
* అక్కడి నుంచి 2:05 గంటలకు కామారెడ్డిని బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు మోడీ
* మధ్యాహ్నం 2:15 నుంచి 2:55 వరకు సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ
* ఆ సభ అనంతరం సాయంత్రం 4:05 గంటలకు రంగారెడ్డి జిల్లాకు ప్రధాని మోడీ
* నేటి సాయంత్రం 4:15 నుంచి 4:55 గంటల వరకు నిర్వహించనున్న బహిరంగ సభలో మోడీ హాజరు
* నేటి రాత్రికి రాజ్ భవన్ లో ప్రధాని మోడీ బస
* రేపు దుబ్బాక, నిర్మల్ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొననున్న ప్రధాని మోడీ
* రేపు ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కన్హయ్య శాంతివనంలో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు..
* మధ్యాహ్నం 2 గంటలకు దుబ్బాకకు.. మ. 2:15 గంటల నుంచి 2:45 వరకు తుఫ్రాన్ లో నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లో మోడీ
* ఆ సభ అనంతరం నిర్మల్ కు మోడీ.. మధ్యాహ్నం 3:45 నుంచి సాయంత్రం 4:25 వరకు బహిరంగ సభలో హాజరు
* నిర్మల్ నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని సాయంత్రం 5:45 గంటలకు తిరుపతికి వెళ్లనున్న ప్రధాని మోడీ
* ఎల్లుండి మహబూబాబాద్, కరీంనగర్ పబ్లిక్ మీటింగ్ తో పాటు హైదరాబాద్ లో ప్రధాని మోడీ రోడ్డు షో
* ఎల్లుండి తిరుపతి నుంచి బయలుదేరి 11:30 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని మోడీ
* మహబూబాబాద్ చేరుకుని మ. 12:45 నుంచి 1:25 వరకు నిర్వహించే బహిరంగ సభకు మోడీ హాజరు.. ఆ సభ అనంతరం కరీంనగర్ కు వెళ్లనున్నారు..
* మ. 2:45 గంటల నుంచి 3:25 వరకు కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్న ప్రధాని మోడీ.. ఇక, అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40కి హైదరాబాద్ కు చేరుకోనున్నారు..
* సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు నిర్వహించే రోడ్ షోలో పాల్గొననున్న మోడీ
* విమానాశ్రయం నుంచి ఈ రోడ్ షో ప్రారంభం కానుంది.. రోడ్ షో అనంతరం నేరుగా హైదరాబాద్ నుంచి 6:25 గంటలకు ఢిల్లీకి ప్రధాని మోడీ తిరుగు పయనం