Site icon NTV Telugu

PM Modi : ఏప్రిల్ 8న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ

Pm Narendra Modi

Pm Narendra Modi

ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 8న ఆయన హైదరాబాద్‌కు వస్తారని బీజేపీ వర్గాలకు వెల్లడించాయి. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారని తెలుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు ప్రారంభించడంతో పాటు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. రైల్వే శాఖ అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ మేరకు రైల్వే శాఖకు మోడీ పర్యటనపై ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే.. తాజాగా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ కొత్త సర్వీసు ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం కానుంది.

Also Read : Doctors Protest : పానీపూరీలు అమ్ముకుంటున్న డాక్టర్..

ఈ వందేభారత్ నూతన సర్వీసు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడవనుంది. దీనికి సంబంధించి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ట్రయిల్ రన్ ఇప్పటికే పూర్తి చేశారు రైల్వే అధికారులు. ఇందుకోసం అందుబాటులో ఉన్న మూడు మార్గాల్లో ఏ రూట్​ను ఖరారు చేయాలనే దానిపైనా అధ్యయనం చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే ఇతర రైళ్లల్లో ప్రయాణికులకు దాదాపు 12 గంటల సమయం పడుతోంది. అదే వందేభారత్ అందుబాటులోకి రావటం ద్వారా 6 నుంచి 7 గంటల సమయంలోనే గమ్యస్థానానికి చేరుకుంటుండటంతో వందే భారత్‌ట్రైన్‌పైనే ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు.

Also Read : Shooting At Gurudwara: అమెరికాలోని గురుద్వారాలో ఫైరింగ్ .. సిక్కుల మధ్య ముష్టియుద్ధం

Exit mobile version