ప్రధాని మోడీ ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా మోడీ వారణాసిలో పర్యటించనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి మోడీ ఎన్నికయ్యారు. ఇక పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని.. రైతులకు ప్రయోజనం చేకూర్చే సమ్మాన్ నిధిని విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి: Bike Safety: వర్షాకాలంలో మీ బైక్ పాడవకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి
వారణాసిలోని రోహనియా, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతుల సదస్సుకు వేదిక ఉండనున్నట్లు యూపీ బీజేపీ నేతలు తెలిపారు. సదస్సులో పాల్గొన్న అనంతరం దశాశ్వమేధ ఘాట్‌లో గంగా హారతిలో మోడీ పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. మోడీ పర్యటన నేపథ్యంలో వారణాసిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: United Kingdom: మా డిమాండ్లకు మద్దతిచ్చిన వారికే ఓట్లు.. బ్రిటన్ లో మేనిఫెస్టో విడుదల చేసిన హిందువులు
గత ఆదివారం మోడీ 3.0 ప్రభుత్వం కొలువుదీరింది. 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293 సీట్లు సాధించగా.. బీజేపీ సొంతంగా 240 సీట్లే సాధించింది. ప్రస్తుతం మిత్రపక్షాలతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Terror attack: జమ్మూ కాశ్మీర్ హై అలర్ట్.. భద్రతా బలగాలపై ఉగ్రదాడికి అవకాశం..