PM Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించనున్న ప్రధాని.. 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు మధ్యాహ్నం మీరట్ లోని శతాబ్ది నగర్ స్టేషన్లో మీరట్ మెట్రో మరియు నమో భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆయన శతాబ్ది నగర్ నుండి మీరట్ సౌత్ స్టేషన్ వరకు స్వయంగా మెట్రోలో ప్రయాణించనున్నారు. ఆ తర్వాత మీరట్ లో రూ.12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Income Tax Rules: క్రెడిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. ఐటీ శాఖ కొత్త నిబంధనలు ఇవే!
Also Read
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
- Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. 'నేరేడుపండు జ్యూస్' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ఢిల్లీ-మీరట్ మధ్య నిర్మించిన పూర్తి 82 కిలోమీటర్ల పొడవైన ‘నమో భారత్’ కారిడార్‌ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న 5 కి.మీ సెక్షన్. ఇంకా ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న 21 కి.మీ సెక్షన్లను ఆయన ప్రారంభిస్తారు. గంటకు 180 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ ‘రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ (RRTS), దేశంలోనే మొట్టమొదటిది. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్, మీరట్ వంటి ప్రధాన పట్టణాలను ఢిల్లీతో అతివేగంగా అనుసంధానిస్తుంది.
నమో భారత్ రైళ్లు ప్రయాణించే అదే ట్రాక్స్ పైన మీరట్ మెట్రో కూడా నడవడం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత. గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ మెట్రో, దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రో వ్యవస్థగా రికార్డు సృష్టించనుంది. మీరట్ సౌత్ నుండి మోదీపురం వరకు ఉన్న మొత్తం దూరాన్ని అన్ని స్టాపులతో కలిపి కేవలం 30 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
ఒకే ట్రాక్ పై ఇంటర్-సిటీ ప్రయాణం కోసం ‘నమో భారత్’, ఇంట్రా-సిటీ (నగరం లోపల) ప్రయాణం కోసం ‘మీరట్ మెట్రో’ సేవలను అనుసంధానించడం ద్వారా భారతీయ రవాణా రంగంలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఈ వ్యవస్థ వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణం మరింత సులభతరం కానుంది.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..