PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన కొనసాగనుంది.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని సందర్శించనున్నారు మోడీ.. ఇక, ఈ పర్యటనలో పాలసముద్రంలో ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ ఏర్పాటు కానుంది. రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు చేయనున్నారు.. 503 ఎకరాల్లో విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం ఏర్పాటు కానుంది.. అయితే, దీనిని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభంకానుంది. లేపాక్షి ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు మోడీ.
Read Also: Narendra Modi: కేరళలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
ఇక, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.55 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు ప్రధానిన మోడీ.. సత్యసాయి ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో మధ్యాహ్నం 1.20 గంటలకు లేపాక్షి దగ్గర హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 1.30 గంటలకు వీరభద్రస్వామి టెంపుల్‌కు చేరుకుంటారు.. 1.30 నుంచి 2.30 గంటల వరకు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక, 2.45కి లేపాక్షి హెలిప్యాడ్ నుంచి బయల్దేరి 3.05 గంటలకు పాలసముద్రం సమీపంలోని నాసిన్ కేంద్రానికి చేరుకుంటారు.. సాయంత్రం 5 గంటల వరకు నాసిన్ లో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ఇక, 5.15 గంటలకు నాసిన్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయల్దేరి 5.35 గంటలకు పుట్టపర్తి చేరుకోనున్న ప్రధాని మోడీ.. సాయంత్రం 5.40కి పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి.. సాయంత్రం 6.45 గంటలకు కేరళలోని కొచ్చికి చేరుకోనున్నరు ప్రధాని మోడీ. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.. ఏపీ పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీకి గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలకనున్నారు.. ప్రారంభోత్సవాల అనంతరం సభలో పాల్గొని ప్రారంభిస్తారు ప్రధాని మోడీ.. ఇక, ఈ పర్యటనలో లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన పురస్కరించుకుని పుట్టపర్తి విమానాశ్రయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం చేపట్టారు. మరోవైపు ప్రధాని మోడీ సాయంత్రం 5.15 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో పుట్టపర్తి చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మళ్లీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
Read Also: Animal OTT Release: ‘యానిమల్’ లవర్స్‌కు షాక్.. ఓటీటీ రిలీజ్ లేనట్టే?
కాగా, శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలో 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రాన్ని పూర్తి చేశారు.. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ఇక్కడి నుంచి గంటలో చేరుకునేంత దూరం ఉండటం కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు.. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్ తరహాలో ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపికైనవారికి ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. ఆవరణలోనే సోలార్ సిస్టం కూడా ఇప్పటికే సిద్ధం చేశారు అధికారులు..