Site icon NTV Telugu

NITI Aayog : ప్రధాని మోడీ అధ్యక్షతన 8వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం

Niti Ayoge

Niti Ayoge

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ ( శనివారం ) జరుగనున్న నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి బీజేపీయేతర ప్రతిపక్షాల సీఎంలు హాజరు కావడం లేదు.. ఆంధ్రప్రదేశ్, ఒడిసా, ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ మాత్రమే హాజరవుతున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పినా చివరలో ఆయనా వెళ్లడం మానుకున్నారు.

Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంతో పాటు నీతి ఆయోగ్ వర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలే కాకుండా.. యూపీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యమంత్రులు కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు కార్యక్రమాలకు తామూ హాజరు కావడం లేదని బీఆర్ఎస్ వర్గాలు కూడా తెలిపారు.

Also Read : Arvind Kejriwal : నేడు తెలంగాణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. కేసీఆర్‎తో జాతీయ రాజకీయాలపై చర్చ

తొలుత నీతి ఆయోగ్‌ భేటీకి హాజరై.. తర్వాత ప్రతిపక్షాల నేతలను కలుసుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అనుకున్నారు. చివరకు ఆమె కూడా ఈ మీటింగ్ ను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. 2045 కల్లా దేశాన్ని అభివృద్ధి చేసేందుకు (వికసిత్‌ భారత్‌) రోడ్‌ మ్యాప్‌ రూపకల్పనకు గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం అవకాశం కల్పిస్తుందని నీతి ఆయోగ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Also Read : Nepal PM Visit India : నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని

మరోవైపు నీతి ఆయోగ్ మీటింగ్ ను బహిష్కరిస్తున్నామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోడీకి శుక్రవారం రెండు పేజీల లేఖను ఆయన రాశారు. ప్రధాన మంత్రి సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉండకపోతే.. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలని ప్రజలు అడుగుతున్నారు.. కోఆపరేటివ్ ఫెడరలిజం ఒక జోక్ అయినప్పుడు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకావడం ఎందుకు అని లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Also Read : MI vs GT: గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఘోర పరాజయం

నీతి ఆయోగ్ చైర్మన్‌గా ప్రధాని మోదీ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారత మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నారు. (i) విక్షిత్ భారత్@2047, (ii) MSMEలపై ఒత్తిడి, (iii) మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడులు, (iv) అనుసరణలను తగ్గించడం, (v) మహిళా సాధికారత, (vi) సహా ఎనిమిది ప్రముఖ థీమ్‌లు రోజంతా జరిగే సమావేశంలో చర్చించబడతాయి. ఆరోగ్యం మరియు పోషకాహారం, (vii) నైపుణ్యాభివృద్ధి, మరియు (viii) ప్రాంత అభివృద్ధి మరియు సామాజిక మౌలిక సదుపాయాల కోసం గతి శక్తి” అని నీతి ఆయోగ్ పేర్కొంది.

Exit mobile version