NTV Telugu Site icon

Modi- Lulada Silva: ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి మాట్లాడిన బ్రెజిల్ అధ్యక్షుడు.. (వీడియో)

Pm Modi

Pm Modi

మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని మోడీ.. బ్రెజిల్‌‌లో పర్యటిస్తున్నారు. రియో డీజెనిరోలో జరిగిన జీ-20 సదస్సు నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అంతకుముందు అక్కడికి చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. హోస్ట్ బ్రెజిల్ ప్రెసిడెంట్ లూలా డా సిల్వా మోడీకి కరచాలనం చేసి, కౌగిలింతతో స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు చాలా సేపు మాట్లాడుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని మోడీ భుజంపై చేయి వేసి చాలాసేపు మాట్లాడారు.

Read Also: Ram Charan In Kadapa: కడపలో కట్టలు తెంచుకున్న ‘మెగా’ అభిమానం

బ్రెజిల్‌లో జరిగే 19వ జీ20 సదస్సులో ట్రోకా సభ్యునిగా ప్రధాని మోడీ హాజరయ్యారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో పాటు భారతదేశం G20 ట్రోకాలో భాగం. ఈ రోజు, రేపు (నవంబర్ 18-19) జరగనున్న శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే నాయకులలో ప్రధాని మోడీతో పాటు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు. జీ-20 సదస్సులో పాల్గొనడమే కాకుండా ప్రపంచ నేతలతోనూ మోడీ సంభాషించనున్నారు. ఈ సదస్సులో వివిధ బర్నింగ్, గ్లోబల్ సమస్యలపై భారతదేశం యొక్క స్టాండ్‌ను ప్రధాని మోడీ ప్రదర్శించనున్నారు.

Read Also: Rajnath Singh: కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా.. సోమవారం ఉదయం బ్రెజిల్‌లోని రియో ​​డి జెనీరో చేరుకున్నారు. అక్కడ అతనికి భారతీయ సమాజం ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. భారతీయ సమాజం ప్రజలు సంస్కృతంలో మంత్రోచ్ఛారణలతో మోడీకి స్వాగతం పలికారు. చివరి దశలో ప్రధాని మోడీ నవంబర్ 19 నుంచి 21 వరకు అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానాలో పర్యటించనున్నారు. 50 ఏళ్ల తర్వాత భారత ప్రధాని గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి.

Show comments