Site icon NTV Telugu

PM Modi Srisailam Visit: తొలిసారి శ్రీశైలానికి మోడీ.. శక్తిపీఠాన్ని దర్శించుకున్న ఐదో ప్రధాని..

Pm Modi

Pm Modi

PM Modi Srisailam Visit: ప్రధాని మోడీ శ్రీశైలం పర్యటన కొనసాగుతోంది. తాజాగా ప్రధాని శ్రీశైలానికి చేరుకున్నారు. తొలిసారి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. ఆలయం వద్ద సీఎం డిప్యూటీ సీఎం, శివసేవకులు, కూటమి కార్యకర్తలు, బీజేపీ అభిమానులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలనంతం శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శించనున్నారు. కాగా.. శ్రీశైల జ్యోతిర్లింగం, భ్రమరాంబికా శక్తిపీఠాన్ని దర్శించుకున్న ఐదవ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలవనున్నారు.. గతంలో ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు.. మరోవైపు.. మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ కొనసాగుతోంది.. శ్రీశైల క్షేత్రం భద్రతావలయంలో ఉంది. ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలంలో రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీశైలం వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు.

READ MORE: Delhi JNU Clash: తీవ్ర ఘర్షణకు దారి తీసిన ‘యూపీ-బీహార్’ వ్యాఖ్య.. కొట్టుకున్న విద్యార్థులు

 

Exit mobile version