PM Modi Srisailam Visit: ప్రధాని మోడీ శ్రీశైలం పర్యటన కొనసాగుతోంది. తాజాగా ప్రధాని శ్రీశైలానికి చేరుకున్నారు. తొలిసారి శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు.. ఆలయం వద్ద సీఎం డిప్యూటీ సీఎం, శివసేవకులు, కూటమి కార్యకర్తలు, బీజేపీ అభిమానులు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.