Site icon NTV Telugu

PM Modi: భారత్ అభివృద్ధి గురించి విదేశాలు చర్చించుకుంటున్నాయి

Modi

Modi

భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి గురించి విదేశాల్లో చర్చించుకుంటున్నారని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లోని (Uttar Pradesh) లక్నోలో (Lucknow) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు.. పలు ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం ప్రజలనుద్దేశించి మోడీ మాట్లాడారు.

ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని చెప్పారు. ఒకప్పుడు యూపీ అంటే ఘర్షణలు.. కర్ఫ్యూలే ఉండేవన్నారు. ఇప్పుడు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కారణంగా యూపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని.. యూపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తనకు ఇంతకు మంచి సంతోషం ఏముంటుంది..?, భారత్‌లో జరుగుతున్న అభివృద్ధిపై విదేశాల్లో కూడా చర్చ జరుగుతోందని మోడీ చెప్పుకొచ్చారు.

తాను 4-5 రోజుల క్రితం యూఏఈ, ఖతార్‌ను సందర్శించి తిరిగి వచ్చానని.. భారతదేశ అభివృద్ధి గురించి ప్రతి దేశం నమ్మకంగా ఉందన్నారు. ప్రపంచం మొత్తం భారతదేశం మెరుగైన రాబడికి హామీగా ఉందని తెలిపారు.

 

 

Exit mobile version