NTV Telugu Site icon

Narendra Modi: నా సురక్ష కవచం కూడా మాతశక్తే.. ప్రధానమంత్రి మోడీ..

Pm Modi

Pm Modi

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. మీ విజయం వెనుక మహిళా ఓటర్ల పాత్ర ఉందని గట్టిగా నమ్ముతున్నారన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. అవును నేను పూర్తిగా అంగీకరిస్తున్న నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నా.. నా సురక్ష కవచం కూడా మాతశక్తే. మహిళా సాధికారత అవసరం ఎంతైనా ఉంది. దేశంలో చాలామందికి ఇప్పటికి మరుగుదొడ్ల సమస్య ఉంది. వంట గ్యాస్ కోసం పైరవీలు సిఫారసులు చేయాల్సి వచ్చేది.

Also read: Narendra Modi : నేను చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.. మానసికంగా రాముడికే అంకితమయ్యాను

పేదోడికి ఇల్లు లేదు. ఇలా చాలా సమస్యలు ఇప్పటికి తిష్ట వేశాయి. ఈ దృక్కోణం మార్చాల్సిన అవసరం ఉంది. అప్పడాలు చేసే కుటుంబాన్ని పోషించేకునే వాళ్లంతా మార్కెట్లోకి రావాలి. వాళ్ల కోసం ఒక పైలెట్ ప్రాజెక్టు చేపట్టాను. దాంతో ఒక్కసారిగా మార్పు కనిపించింది. మహిళల సంపాదన శక్తి పెరిగింది. అలాంటివారిని లక్ష అధికారులను చేయాలన్నది మా సంకల్పం. ఆ క్రమంలో ఆర్గనైజ్డ్ వ్యవస్థతో పనిచేయాల్సి వస్తుంది.

Also read: PM Modi: విపక్షాలు ఓడిపోయాయి.. 2019 రికార్డుల్ని ఈ ఎన్నికలు తుడిచిపెడతాయి..

మూడు కోట్ల మంది సోదరీమణులను లక్షాధికారులను చేయాలని మేనిఫెస్టోలో పెట్టాం. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ దానికదే పైకొస్తుంది. ముద్ర యోజన ద్వారా 70 శాతం మంది మహిళలు స్వాలంబన సాధించారు. స్వయం ఉపాధి సంఘాల పరపతి పెరిగింది. ఎలాంటి గ్యారెంటీలు లేకుండా పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నాం. అందరూ గడువులోపే రుణాలు తీరుస్తున్నారు. ఎన్పీఏలు లేవు. నూతన పార్లమెంటు నిర్మిస్తున్న సమయంలో అందులో మొదటి అడుగు దేనితో వేయాలని చాలా అనుకున్న.. కొత్త పార్లమెంటులో మొదటి బిల్లు నారీ శక్తి వందన్. ఆర్మీలోను మహిళా ప్రాధాన్యం పెరిగింది. చంద్రయ్య ల్యాండ్ అయ్యే స్థలాన్ని శివశక్తిగా నామకరణం చేశాము. ఏం జరిగినా మాత శక్తితోనే సాధ్యమవుతుందని నమ్ముతున్న అని ఆయన తెలిపారు.