NTV Telugu Site icon

PM Modi: మోడీకి కుటుంబం లేదు.. నా జీవితం మీ సేవకే అంకితం: ప్రధాని మోడీ

Pm Modi

Pm Modi

PM Modi Says My life is dedicated to the Nation: తన జీవితం ఓ తెరచిన పుస్తకం అని, దేశం కోసమే తన జీవితం అంకితం అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన ఇంటిని వదిలిపెట్టి ఓ లక్ష్యం కోసం వచ్చానన్నారు. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చడమే తన లక్ష్యం అని ప్రధాని మోడీ చెప్పారు. సోమవారం ఆదిలాబాద్‌లో కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం బీజేపీ విజయ సంకల్ప సభలో మాట్లాడారు.

నా తెలంగాణ కుటుంబ సభ్యులారా, నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగం ఆరంభించారు. ‘ఇది ఎన్నికల సభ కాదు. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించ లేదు. మీరందరూ వికసిత్‌ భారత్‌ కోసం ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ప్రత్యేక ధన్యవాదాలు. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను మా ప్రభుత్వం చేపట్టింది. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వికసిత్‌ భారత్‌పై మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం’ అని అన్నారు.

‘కుటుంబ పార్టీలను అస్సలు నమ్మవద్దు. కుటుంబ పార్టీలో రెండే అంశాలు ఉంటాయి. ఒకటి దోచుకోవడం, రెండోది అబద్ధాలు చెప్పడం. బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదు. కాంగ్రెస్‌ పాలనలో కూడా ప్రజలకు ఏమీ జరగదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి జరిగింది అంటున్న కాంగ్రెస్‌ ఇప్పుడు ఏం చేస్తోంది?. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ రెండూ ఒక్కటే. కొమురం భీం వారసులు మీరంతా. బీజేపీ హయాంలో ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అయ్యారు. ఆదివాసీల అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఇచ్చాం. తెలంగాణలో పసుపు బోర్డు హామీ ఇచ్చాము. నెరవేర్చడం జరిగింది’ అని మోడీ పేర్కొన్నారు.

Also Read: PM Modi: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది: ప్రధాని మోడీ

‘మోడీకి కుటుంబం లేదు.. ప్రజలే కుటుంబం. నా జీవితం మీ సేవకే అంకితం. మీ స్వప్నమే నా సంకల్పం. దేశంలోని కోట్లాది మందే నా కుటుంబం. నేను తెలంగాణ ప్రజలకు ఒక విషయం చెబుతాను. అయోధ్య రామ మందిరంలో తెలంగాణ భాగస్వామ్యం ఉంది. అయోధ్యలో రాముని ఆశీర్వాదం మొత్తం తెలంగాణ ప్రజలపై ఉంది. నాకు మీ ఆశీర్వాదం ప్రేమ కావాలి. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకు పైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం’ అని ప్రధాని చెప్పుకొచ్చారు.