NTV Telugu Site icon

PM Modi: కెనడాలో హిందూ ఆలయాలపై దాడి.. స్పందించిన ప్రధాని మోడీ..

Pmmodi

Pmmodi

కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కర్రలతో ఆలయంపై దాడి చేసి మతపరమైన వాతావరణాన్ని భంగపరిచారు. ఈ సంఘటన తర్వాత.. కెనడాలోని భారతీయ సమాజంలో ఆందోళన పెరిగింది. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ.. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్‌ దృఢ సంకల్పాన్ని బలహీనపరచవని స్పష్టం చేశారు.

READ MORE: Thandel : తండేల్ దుల్లకొట్టే డేట్ వచ్చేసింది

ఈ ఘటనకు సంబంధించి ప్రధాని మోడీ సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఇలా రాశారు.. “ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనాస్థలాలను సంరక్షించాలని మేం కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హింసకు కారకులైన వారిని శిక్షిస్తారని మేం ఆశిస్తున్నాం. కెనడాలో మా దేశీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరు.’’

READ MORE: RK Roja: హోంమంత్రి రాజీనామా చేయాలి.. పవన్‌ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి రోజా

బ్రాంప్టన్ లో ఘటన..
బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయంలో భక్తులపై ఖలిస్థాన్ మద్దతుదారులు కర్రలతో దాడి చేశారు. దాడి చేసిన వారి చేతుల్లో ఖలిస్థాన్ జెండాలు ఉన్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆలయంపై దాడి ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పీల్ ప్రాంతీయ పోలీసు చీఫ్ నిషాన్ దురైయప్ప శాంతిని పెంపొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ సంఘటన ఆ ప్రాంతమంతా భయాందోళనలకు గురిచేసింది.

Show comments