కెనడాలోని బ్రాంప్టన్‌లో హిందూ దేవాలయంపై జరిగిన దాడిని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కర్రలతో ఆలయంపై దాడి చేసి మతపరమైన వాతావరణాన్ని భంగపరిచారు. ఈ సంఘటన తర్వాత.. కెనడాలోని భారతీయ సమాజంలో ఆందోళన పెరిగింది. ఈ ఘటనపై తొలిసారిగా స్పందించిన ప్రధాని మోడీ.. ఇలాంటి హింసాత్మక చర్యలు భారత్ దృఢ సంకల్పాన్ని బలహీనపరచవని స్పష్టం చేశారు.