Parliament Special Session: భారత్‌ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి: ప్రధాని మోడీ

Pm Modi Parliament

Pm Modi Parliament

PM Modi Speech On Parliament Old Building: ‘పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు’ సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌ 75 ఏళ్ల ప్రస్థానంపై లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చను ప్రారంభించారు. మంగళవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. భారత్‌ సువర్ణాధ్యాయానికి ఈ భవనం సాక్షి అని అన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనం నిరంతర ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

‘చరిత్రను గుర్తు చేసుకోవాల్సిన సమయమిది. చారిత్రక పార్లమెంట్‌ భవనానికి వీడ్కోలు పలుకుతున్నాం. ఈ 75 ఏళ్ల ప్రయాణం ఎంతో గర్వకారణమైంది. ఈ 75 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం. భారతీయులు స్వేదం, డబ్బుతో ఈ భవనాన్ని నిర్మించాం. స్వాతంత్ర్యానికి ముందు ఈ భవనం ఇంపీరియల్‌ లెజిస్లేచర్‌ కౌన్సిల్‌గా ఉండేది. ఈ పార్లమెంట్‌ భవనం మనల్ని ఎప్పుడూ ఉత్తేజపరుస్తూనే ఉంటుంది. మనం కొత్త భవనంలోకి వెళుతున్నప్పటికీ.. పాత భవనం భావితరాలకు స్ఫూర్తినిస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

×
×
Ad

‘ఈ భవనానికి వీడ్కోలు పలకడం భావోద్వేగానికి గురిచేస్తోంది. పాత పార్లమెంట్‌తో ఎంతో అనుబంధం ఉంది. పార్లమెంట్‌లో తొలిరోజు నేను భావోద్వేగానికి గురయ్యాను. ప్రారంభంలో మహిళా ఎంపీల సంఖ్య తక్కువగా ఉండేది. క్రమంగా ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రజల సందర్శనకు పాత పార్లమెంట్‌ భవన్‌ తెరిచే ఉంటుంది’ అని ప్రధాని మోడీ తెలిపారు.

Also Read: Mohammad Siraj: నాకు ఓ మెసేజ్ వచ్చింది.. అందుకే సిరాజ్‌తో 7 ఓవర్లే వేయించా: రోహిత్ శర్మ

‘చంద్రయాన్-3 విజయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఇది మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ప్రతీక. చంద్రయాన్-3 విజయం ప్రపంచం మొత్తం సంబరం చేసుకునేలా చేసింది. సమిష్టి కృషి వల్లే జీ-20 సదస్సు విజయవంతమైంది. జీ-20 విజయం దేశ ప్రజలందరిది. భారత్ సామర్థ్యంపై చాలా మందికి సందేహాలు ఉండేవి.. అవన్ని పటాపంచలు అయ్యాయి. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ-20లో కలుపుకున్నాం.. భారత్ ఇప్పుడు అన్ని దేశాలకు విశ్వమిత్రగా మారుతోంది’ అని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.