Narendra Modi : కందుకూరు తొక్కిసలాట దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న నెల్లూరు జిల్లాలోని కందుకూరులో నిర్వహించిన ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ అనే కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ సంతాప సభగా మారింది. పామూరు రోడ్‌లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభలో గందరగోళం, తొక్కిసలాట చోటు చేసుకోవడంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా పలువురు తీవ్రంగా గాయపడటంతో హుటాహుటివారిని ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే చంద్రబాబు తన సభను మధ్యలోనే ఆపేసి, ఆసుపత్రికి వెళ్లారు. బాధితుల్ని పరామర్శించారు.
Also Read : Health Tips : యవ్వనంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు!
అయితే.. ఈ ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు బహిరంగ సభలో జరిగిన దుర్ఘటనవల్ల తీవ్రంగా కలత చెందాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబసభ్యులకు రూ.2 లక్షలు,క్షతగాత్రులకు రూ. 50,000 చొప్పున ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తాం’ అని ప్రధాని మోడీ వెల్లడించారు. అయితే.. ఇదిలా ఉంటే.. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. వారికి పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ జరగలేదన్నారు.
Also Read
- KKR Vs SRH: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. పట్టుబిగించిన కేకేఆర్..
- AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
- West Bengal Elections: మమతా బెనర్జీ నియోజకవర్గంలో మరో గందరగోళం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఎలా అవుట్ చేయాలి.. చాట్ జీపీటీ సమాధానం మైండ్ బ్లోయింగ్..
తాజావార్తలు
-
Dacoit OTT Release Date: అడివి శేష్ ‘డెకాయిట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
-
KKR Vs SRH: పెవిలియన్‌కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. పట్టుబిగించిన కేకేఆర్..
-
AI Viral Story: సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి వెయిటర్‌గా.. ఏఐ దెబ్బకు తలకిందులైన జీవితం..
-
Rain Effect : అకాల వర్షం.. రైతులు ఆగమాగం..
-
Rajasthan Royals Owner: రాజస్థాన్ రాయల్స్ కొత్త ఓనర్‌గా బిలియనీర్ లక్ష్మీ మిట్టల్.. రూ.15,660 కోట్లతో డీల్!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!