NTV Telugu Site icon

Republic Day: ‘దేశ్ రంగీలా’ పాట పాడిన ఈజిప్ట్‌ అమ్మాయి.. ప్రశంసలు కురిపించిన ప్రధాని

Egypt Girl

Egypt Girl

PM Modi Praises Egypt Girl For Singing ‘Desh Rangeela’ On Republic Day: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రసిద్ధ దేశభక్తి గీతం ‘దేశ్ రంగీలా’ను పాడినందుకు ఈజిప్టు అమ్మాయి కరీమాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రశంసించారు. ఇండియా హౌస్‌లో జరిగిన వేడుకలో కరీమాన్ ఈ పాటను అందించారు. ఆమె ప్రదర్శనకు భారతీయులు, ఈజిప్షియన్ల నుంచి ప్రశంసలు లభించాయి. “ఈజిప్ట్‌కు చెందిన కరీమాన్ అందించిన ఈ ప్రదర్శన మధురమైనది! ఈ ప్రయత్నానికి నేను ఆమెను అభినందిస్తున్నాను. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు ఆమె శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్ట్ చేశారు. ఈజిప్ట్‌లోని భారత రాయబార కార్యాలయం ఆమె ప్రదర్శన వీడియోను షేర్ చేసిన పోస్ట్‌పై ప్రధాని మోడీ స్పందించారు.

Read Also: Arun Yogiraj: రామ్ లల్లా విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 5 అద్భుతమైన విగ్రహాలు..

“ఇండియా హౌస్’లో జరిగిన 75వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఈజిప్టు యువతి కరీమాన్ దేశభక్తి గీతం “దేశ్ రంగీలా”ను ప్రదర్శించింది. ఆమె మధురమైన గానం, చక్కటి స్వరం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భారతీయులు, ఈజిప్షియన్లను ఆకట్టుకుంది,” అని ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. కాగా, భారతదేశంలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. దీని తర్వాత జాతీయ గీతం, స్వదేశీ తుపాకీ వ్యవస్థలు, 105-ఎమ్ఎమ్ ఇండియన్ ఫీల్డ్ గన్‌లతో 21-గన్ సెల్యూట్ అందించబడింది. రిపబ్లిక్ డే పరేడ్‌కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంవత్సరం కవాతులో దాదాపు 13,000 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా తమ వారసత్వ వైవిధ్యాన్ని ప్రదర్శించాయి.