NTV Telugu Site icon

Covishield: ఆ సర్టిఫికేట్లో నుంచి మోడీ ఫోటో తొలగింపు..

Modi Photo

Modi Photo

కొవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇటీవ‌ల ఆ టీకా త‌యారు చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ చెప్పడంతో.. భార‌త్‌లో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. కోవిడ్‌- 19 టీకా తీసుకున్న వారికి ఇచ్చే కోవిన్ స‌ర్టిఫికేట్‌లో ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోటోను కేంద్ర ఆరోగ్య మంత్విత్వ శాఖ ఆ సర్టిఫికేట్ నుంచి తొలగించింది. చాలా అరుదైన కేసుల్లో కొవిషీల్డ్ వ‌ల్ల .. ర‌క్తం గడ్డకట్టే ఛాన్స్ ఉందని ఆస్ట్రాజెనికా కంపెనీ ఇటీవ‌ల కోర్టులో అంగీక‌రించింది. కానీ, భార‌త్‌లో ఎన్నిక‌ల నియ‌మావ‌ళిని దృష్టిలో పెట్టుకుని కోవిన్ స‌ర్టిఫికేట్‌లో మోడీ ఫోటోను తొల‌గించిన‌ట్లు అధికార వ‌ర్గాలు చెప్పుకొచ్చాయి.

Read Also: Chennai Super Kings: చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐదుగురు స్టార్ బౌలర్లు దూరం!

కాగా, లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎన్నికల కమిషన్ ఆప్ ఇండియా (ఈసీఐ) ఇచ్చిన ఆదేశాల మేర‌కు కోవిన్ స‌ర్టిఫికేట్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొల‌గించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అయితే, బ్రిట‌న్‌కు చెందిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూరోప్ దేశాల్లో వాక్స్‌జెవేరియా పేరుతో టీకాను పంపిణీ చేస్తుంది. ఆ టీకానే కొవిషీల్డ్ పేరుతో భారత్ లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ తయారు చేసింది. కొవిషీల్డ్ వ‌ల్ల కొన్ని అరుదైన కేసుల్లో రక్తం గడ్డ కట్టే అవ‌కాశాలు ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.