NTV Telugu Site icon

PM Modi: తొలి కేబినెట్ భేటీ.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం

Cen

Cen

ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఢిల్లీలోని మోడీ నివాసంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆదివారమే మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక సోమవారం పీఎంవోలో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించి.. సిబ్బందికి అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. అనంతరం సాయంత్రం కేబినెట్ తొలి సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మంత్రి అవాస్‌ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది.

ఇది కూడా చదవండి: Minor Rape : కీచక లెక్చరర్‌.. మైనర్‌ అమ్మాయిపై అత్యాచారం

ఇక మోడీ బాధ్యతలు స్వీకరించాక రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది.

ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఎంఎల్ ఖట్టర్, హెచ్‌డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్, సర్బానంద సోనోవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Suresh Gopi: కేంద్ర మంత్రి పదవికి రాజీనామాపై క్లారిటీ!