భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ తో పాటు పలువురు నేతలతో ఆయన వరుసగా సమావేశం అయ్యారు. ఇక న్యూయార్క్ చేరుకున్న మాస్క్ అక్కడ అమెరికన్ పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. అనంతరం ప్రొఫెసర్ పాల్ రోమర్‌తో ప్రధాని మోడీ సమావేశం అయ్యారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై అమెరికా పెట్టుబడిదారుడు రే డాలియోతో ప్రధాని ప్రధానంగా చర్చించారు.
Read Also: Ashes Test 2023: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా బోణి.. పలు రికార్డులు బద్దలు!
అనంతరం అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, రచయిత, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డి గ్రాస్ టైసన్‌తో భేటీ అయ్యారు. న్యూయార్క్‌లో ప్రధాని అకడమిక్స్.. థింక్ ట్యాంక్ గ్రూపుల సభ్యులతో సమావేశమై పలు అంశాలపై చర్చించుకున్నారు. అమెరికాలో ఆరోగ్య నిపుణుల టీమ్స్ సభ్యులతో మోడీ భేటీ అయ్యారు.
Read Also: Union Minister: రాష్ట్రంలో ఒక్కసారి అవకాశమివ్వండి.. కేంద్ర మంత్రి
గ్రామీ అవార్డు గ్రహీత భారతీయ-అమెరికన్ గాయకుడితోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. అమెరికాలోని ప్రముఖ ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, ఆరోగ్య రంగ నిపుణులతో వరుసగా సమావేశమై భారతదేశంలో పెట్టుబడులు పెట్టే అంశంపై వారితో మాట్లాడారు.
Read Also: US President Son: అమెరికా అధ్యక్షుడి కొడుకుకి జైలు శిక్ష..!
అయితే.. అంతకు ముందు.. ఇవాళ( బుధవారం ) ఉదయం న్యూయార్క్ చేరుకున్న ప్రధాని మోడీ మార్నింగ్ వాకింగ్ చేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలో దిగిన మోడీ అతిథి హోటల్ కు వచ్చారు. అనంతరం హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అకస్మాత్తుగా అమెరికన్ వీధుల్లో నడిచారు. అక్కడ ఉన్న భారతీయులకు అభివాదం చేస్తు ముందుకు సాగారు. దీంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
