Site icon NTV Telugu

PM Modi: తన ఫోటో పట్టుకున్న బాలుడిని గమనించిన ప్రధాని మోడీ.. ఏం చేశారంటే..?

Pm Modi

Pm Modi

PM Modi: తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రావాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా నేడు ప్రధాని మోడీ కేరళలో ర్యాలీ నిర్వహించారు. మోడీ నేతృత్వంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే.. మోడీ ఈ సభలో మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తన ప్రసంగం మధ్యలోనే జనాల్లో ఉన్న ఓ బాలుడు ప్రధాని దృష్టిని ఆకర్షించాడు. చేతిలో ప్రధాని ఫొటో పట్టుకుని చాలాసేపు అలాగే నిలబడి ఉండటాన్ని గమనించారు. వెంటనే తన ప్రసంగాన్ని ఆపిన ప్రధాని ఆ బాలుడిని వేదికపై నుంచి పలకరించారు. ఇది చూసిన సభా ప్రాంగణం మొత్తం చప్పట్లతో మార్మోగింది.

READ MORE: Karnataka: పిల్లలు లేరన్న కోపంతో భార్యను చంపిన భర్త.. హార్ట్ ఎటాక్‌గా చిత్రీకరించి చివరికీ..

ఆ బాలుడిని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. “చాలాసేపుగా ఈ చిన్నబ్బాయి చేతిలో ఫొటో పట్టుకుని నిలబడి ఉన్నాడు. నువ్వు అలసిపోయి ఉంటావు. ఆ ఫొటో నాకు ఇవ్వు. వెనుక నీ ఇంటి చిరునామా రాయు. నేను నీకు లేఖ రాస్తాను,” అని చెప్పారు. ప్రధాని మాటలకు అక్కడున్నవారు ఆనందంతో కేరింతలు కొట్టారు. అంతేకాదు.. ఆ ఫొటోను జాగ్రత్తగా తీసుకోవాలని ఎస్పీజీ సిబ్బందికి సూచించారు. “ఇది ఆ చిన్నారి ప్రేమకు, ఆశీర్వాదాలకు గుర్తు. చాలా జాగ్రత్తగా తీసుకోండి,” అని మోడీ అన్నారు. ఈ మాటలు అక్కడున్నవారిని మరింత కదిలించాయి. ప్రసంగం కొనసాగుతుండగానే మరో విషయం కూడా ప్రధాని గమనించారు. జనాల్లో ఓ మహిళ పెద్ద పుస్తకం పట్టుకుని తనకు ఇవ్వాలని చూస్తున్నట్టు గుర్తించారు. “ఆ మహిళ కూడా నాకు ఏదో ఇవ్వాలనుకుంటోంది. పెద్ద పుస్తకం చేసి తీసుకొచ్చింది,” అంటూ చిరునవ్వుతో చెప్పారు. ఈ చిన్న సంఘటనలు ర్యాలీ వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చాయి.

READ MORE: Ajith Kumar : రెండేళ్లకో సినిమాతో కనిపిస్తున్న అజిత్‌.. సినిమాలపై ఎందుకు కాన్సన్‌ట్రేషన్‌ చేయట్లేదు

Exit mobile version