NTV Telugu Site icon

Parmliament Sessions: వాడీవేడిగా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు.. మీడియాతో సంభాషించనున్న ప్రధాని!

Parliament

Parliament

Parmliament Sessions: పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మీడియాతో సంభాషించే అవకాశం ఉందని లోక్‌సభ సెక్రటేరియట్ మంగళవారం తెలిపింది. పార్లమెంట్ సెషన్స్ బుధవారం ప్రారంభమై డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. సభా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో భాగంగా ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు పార్లమెంట్ ఆవరణలో రక్షణ మంత్రి, లోక్‌సభ ఉపనేత రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. రెండు గంటల పాటు కొనసాగిన భేటీకి 30కిపైగా పార్టీల నేతలు విచ్చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలను పార్లమెంటులో చర్చించాలని ప్రతిపక్షాలు సూచించాయి. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్‌ పేర్కొంది. రాజ్యసభ సెక్రటేరియట్ సభ్యుల కోసం ప్రవర్తనా నియమావళిని విడుదల చేసింది.

Exit Polls: ఆప్‌కు భారీ ఎదురుదెబ్బ.. అదే పెద్ద విషయమన్న కేజ్రీవాల్

ఇంటర్ సెషన్ వ్యవధిలో మరణించిన సభ్యులకు మొదటి రోజు లోక్‌సభ నివాళులర్పిస్తుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ అక్టోబర్‌లో కన్నుమూసిన సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు ములాయం సింగ్ యాదవ్, మరణించిన సభ్యులలో చిరస్మరణీయులు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ ఎగువ సభకు ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా రాజ్యసభలో కార్యకలాపాలను నిర్వహించే ప్రారంభ సెషన్ ఇది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 8 మధ్య జరిగాయి. శీతాకాల సమావేశాల కోసం కేంద్రం అజెండాలో 16 కొత్త బిల్లులున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దేశసరిహద్దుల భద్రత అంశంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.