ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటనకు సోమవారం బయల్దేరి వెళ్లారు. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఇక తొలుత ఇండోనేషియా చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. ఇండోనేషియాలోకి ప్రవేశించగానే.. యుద్ధ విమానాలతో స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ప్రధాని మోడీ విమానం నుంచి వీక్షించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రాజధాని జకార్తాకు చేరుకున్న మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా స్వాగతం పలికారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత ద్వైపాక్షిక సంబంధాలను మరోసారి చాటిచెప్పారు. మోడీ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం ఇండోనేషియా గగనతలంలోకి ప్రవేశించిన క్షణం నుంచి ఆ దేశ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ప్రత్యేక ఎస్కార్ట్‌ను అందించాయి. భారత ప్రధాని విమానాన్ని జకార్తా వరకు భద్రతా పరిరక్షణతో వెంట తీసుకెళ్లడం ద్వారా ఇండోనేషియా ప్రభుత్వం అత్యున్నత గౌరవాన్ని ప్రదర్శించింది.
విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమంలో ఇరు దేశాల ఉన్నతాధికారులు, దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా భారత్-ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ సహకారం, సముద్ర భద్రత, ఇండో-పసిఫిక్ ప్రాంతీయ సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటన ద్వారా భారత్-ఇండోనేషియా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఇరు దేశాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రధాని మోడీ పర్యటనలో పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.
#WATCH | Indonesia offers a grand welcome to PM Narendra Modi as its fighter jets accompany PM’s plane. pic.twitter.com/v2mVDmfsCO
— ANI (@ANI) July 6, 2026
#WATCH | PM Narendra Modi just landed in Jakarta. He was accorded a warm welcome by Indonesia.
President Prabowo Subianto welcomed him at the airport.
Fighter jets from the Indonesia Air Force accompanied PM’s plane from the time PM entered their air space. pic.twitter.com/B4DOAn6w4j
— ANI (@ANI) July 6, 2026
#WATCH | Prime Minister Narendra Modi arrives in Jakarta, Indonesia. Indonesia's President Prabowo Subianto receives him at the airport.
(Video: ANI/DD) pic.twitter.com/4wbr5cKK5g
— ANI (@ANI) July 6, 2026
Prime Minister Narendra Modi arrives in Jakarta, Indonesia. Indonesian President Prabowo Subianto receives him at the airport.
(Pic: ANI/DD) pic.twitter.com/gyqAohzwQr
— ANI (@ANI) July 6, 2026
#WATCH | Prime Minister Narendra Modi watches a cultural display after his arrival in Jakarta, Indonesia. Indonesian President Prabowo Subianto received him at the airport.
(Video: ANI/DD) pic.twitter.com/DFPcjKe94A
— ANI (@ANI) July 6, 2026

