NTV Telugu Site icon

Pamban Bridge: పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ.. జాతికి అంకితం!

Pamban Bridge Pm Modi

Pamban Bridge Pm Modi

శ్రీరామ నవమి 2025 సందర్భంగా భారతదేశంలోని మొదటి వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్‌ను (పంబన్ బ్రిడ్జ్‌) ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. రిమోట్‌ పద్ధతిలో పంబన్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన ప్రధాని.. వంతెనను జాతికి అంకితమిచ్చారు. అదే సమయంలో రామేశ్వరం-తాంబరం (చెన్నై) కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి రైలు బయలుదేరింది.

Also Read: Ayodhya Ram Mandir: అయోధ్యలో అద్భుత దృశ్యం.. బాలరాముడికి ‘సూర్యతిలకం’!

తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో పంబన్ బ్రిడ్జ్‌ను నిర్మించారు. రైల్‌ వికాస్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఈ ప్రాజెక్టును నాలుగు ఏళ్లలో పూర్తి చేసింది. సముద్రంలో 2.08 కిలోమీటర్ల పొడవున బ్రిడ్జ్‌ను తీర్చిదిద్దారు. బ్రిడ్జ్‌ దిగువన ఓడల రాకపోకలకు వీలుగా వర్టికల్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్‌ రామేశ్వరం ద్వీపాన్ని భారత ఖండంతో అనుసంధానం చేస్తుంది. పంబన్ బ్రిడ్జ్‌ నిర్మాణం భారతదేశ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 2019 మార్చి 1న ప్రధాని మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 2024 నవంబర్ నాటికి పూర్తయింది. 1914లో బ్రిటిష్ ఇంజనీర్లు నిర్మించిన పాత పాంబన్ బ్రిడ్జ్‌ 105 సంవత్సరాల పాటు సేవలందించింది. అయితే సముద్ర వాతావరణం వల్ల క్షీణించడం, తుప్పు పట్టడం వల్ల డిసెంబర్ 2022లో ఈ వంతెన ఉపయోగం ఆగిపోయింది.