NTV Telugu Site icon

Supreme Court: సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు ప్రారంభం.. అందుబాటులోకి వచ్చిన డిజిటల్ ఫార్మాట్‌

Supreme Court

Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించారు. అనంతరం సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించారు. దీంతో దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు (డీజీ ఎస్‌సీఆర్), డిజిటల్ కోర్టులు 2.0, అనంతరం 1950 నుంచి ఉన్న సుప్రీం కోర్టు నివేదికలు, 519 వాల్యూమ్స్ నివేదికలు, 36,308 కేసుల తీర్పులు డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ప్రధాని మోడీ మాట్లాడుతూ.. “భారత సుప్రీంకోర్టు 75 ఏళ్లు పూర్తి చేసుకుంది.. ఏడు దశాబ్దాల్లో సుప్రీంకోర్టు ఎన్నో చరిత్రాత్మక తీర్పులనిచ్చింది.. ప్రజాస్వామ్య పరిరక్షణకు సామాజిక న్యాయానికి సుప్రీంకోర్టు నిరంతరం కృషి చేసింది.. కోర్టుల డిజిటలైజేషన్‌ గొప్ప ముందడుగు.. దేశ పౌరుల హక్కులను కాపాడడంలో సుప్రీంకోర్టుది కీలక పాత్ర.” అని ప్రధాని పేర్కొన్నారు.

Read Also: Nitish Kumar: పువ్వు పార్టీతో నితీశ్‌కు కలిసొచ్చేదేంటి?

సుప్రీం బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
1950 జనవరి 28 ఉదయం 9.45 గంటలకు న్యాయమూర్తులు తొలిసారి సమావేశమవడంతోనే సుప్రీంకోర్టు అధికారికంగా ప్రారంభించినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్నకోర్టు అందుబాటులోకి రాకముందు పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్‌ ఆఫ్‌ ప్రిన్సెస్‌లో న్యాయస్థానం కొనసాగింది. తొలిరోజుల్లో ధర్మాసనం ఏడాదికి 28 రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే సమావేశమయైంది. అనంతరం ఏడాదికి 190 రోజులు పని చేసే స్థాయికి చేరుకుంది.

ఇక ప్రారంభంలో జడ్జిల సంఖ్య 8 ఉంది ఉండగా ఇప్పుడా సంఖ్య 34కు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలోని తిలక్‌మార్గ్‌లో ఉన్న సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల త్రికోణాకార స్థలంలో నిర్మితమైంది. 1954 అక్టోబరు 29న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో నాలుగేళ్లకు 1958 ఆగస్టు 4న ఆయనే దీన్ని ప్రారంభిస్తూ న్యాయ దేవాలయంగా అభివర్ణించా

Show comments