NTV Telugu Site icon

PM Modi: రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం

Pm Modi

Pm Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రూ.8,021 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఎన్టీపీసీ రూ.6 వేల కోట్లతో చేపట్టిన విద్యుత్తు ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారు. రూ.1,200 కోట్ల వ్యయంతో మనోహరాబాద్‌-సిద్దిపేట మధ్య నిర్మించిన 76 కి.మీ కొత్త రైలు మార్గం, రూ.305 కోట్లతో మన్మాడ్‌-ముద్కేడ్‌-మహబూబ్‌నగర్‌- డోన్‌ మధ్య చేపట్టిన రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టును, సిద్దిపేట-సికింద్రాబాద్‌ మార్గంలో తొలి రైలు సర్వీసును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.

Also Read: India-Canada Row: 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ హెచ్చరిక!

వీటితోపాటు సుమారు రూ.1,360 కోట్లతో 496 బస్తీ దవాఖానాల ఏర్పాటు, ఆయుష్మాన్‌ భారత్‌ కింద పలు జిల్లా కేంద్రాల్లో 50 పడకలతో నిర్మించబోయే 20 క్రిటికల్‌ కేర్‌ విభాగాల పనులను ప్రధాని ప్రారంభించారు. పవర్, హెల్త్, రైల్వే ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు. రూ.1369కోట్లతో హెల్త్ సెంటర్స్‌కు భూమిపూజ చేశారు. ముందుగా నా కుటుంబ సభ్యులారా అంటూ  ప్రధాని మోడీ ప్రసంగించారు. తమ ప్రభుత్వం శంకుస్థాసనలే కాదు.. వాటిని పూర్తి చేస్తున్నామన్నారు. ఇది మా వర్క్ కల్చర్ నిదర్శనమన్నారు. త్వరలో భారతీయ రైల్వే వందశాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తవుతుందని తెలిపారు. బీబీనగర్ లో ఎయిమ్స్ నిర్మిస్తున్న ఎయిమ్స్ భవనాన్ని మీరు చూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజల విద్యుత్ అవసరాలు తీర్చేందుకు తాము కృషి చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు

ఇదిలా ఉండగా.. కాసేపట్లో బీజేపీ ఏర్పాటు చేసిన ‘ఇందూరు జనగర్జన సభ’ ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై ప్రధాని మోడీ ప్రసంగించనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు అంశాన్ని ఇక్కడ జరిగే సభలో మరోమారు ప్రస్తావించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్న క్రమంలో.. బోర్డు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? దానికి ఎంతకాలం పడుతుంది? తదితర విషయాలపై ప్రధాని స్పష్టత ఇస్తారని రైతులు ఆశిస్తున్నారు.