NTV Telugu Site icon

PM Modi: అబుదాబిలో మోడీ టూర్.. హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని

Modi Tour

Modi Tour

ప్రధాని మోడీ (PM Modi) ఈనెల 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని (First Hindu Temple) ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. అబుదాబిలోని (Abu Dhabi) మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించి.. భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

రెండురోజుల పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోడీ సమావేశం అవుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా విస్తరించడానికి.. బలోపేతం చేయడానికి చర్చించుకోనున్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకునే మార్గాలపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు.

అలాగే పర్యటనలో భాగంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌తో కూడా ప్రధాని మోడీ భేటీ కానున్నారు. ఆయన ఆహ్వానం మేరకు దుబాయ్‌లో జరిగే ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2024లో పాల్గొని మోడీ ప్రత్యేక కీలకోపన్యాసం చేయనున్నారు.

2015 తర్వాత ప్రధాని మోడీ (PM Modi) యూఏఈలో (UAE) పర్యటించడం ఇది ఏడోది కాగా.. గత ఎనిమిది నెలల్లో ఇది మూడో పర్యటన కావడం విశేషం.

ఇది కూడా చదవండి:Jyothi Rai : ప్రియుడి కోసం అక్కడ టాటూ వేయించుకున్న జ్యోతి రాయ్..