Site icon NTV Telugu

PM Modi: నేడు జమ్మూలో పర్యటించనున్న ప్రధాని మోడీ..

Modi

Modi

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇవాళ (మంగళవారం) జమ్మూలో పర్యటించనున్నారు. దాదాపు రూ.13,375 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై అధికారులు నిషేధం విధించారు. నేటి సాయంత్రం 5 గంటల వరకు క్రాకర్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే డ్రోన్లు ఎగురవేతను సైతం అధికారులు నిషేధించారు.

Read Also: Astrology: ఫిబ్రవరి 20, మంగళవారం దినఫలాలు

ఇక, ప్రధాని మోడీ జమ్మూలో నిర్మించిన ఎయిమ్స్‌ను నేడు ప్రారంభించబోతున్నారు. ఈ ఆస్పత్రికి పునాది రాయిని 2019 ఫిబ్రవరిలో వేశారు. అంతే కాకుండా 48.1 కిలో మీటర్ల పొడవైన బనిహాల్- సంగల్దాన్ రైల్వే సెక్షన్‌ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. అయితే, మొత్తం రూ.32,000 వేల కోట్లతో పలు అభివృద్ది పనులను ఆయన జాతీకి అంకితం చేయనున్నారు. ఈ రైలు విభాగం కాశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతూ 272 కిలో మీటర్ల పొడవైన ఉధంపూర్- శ్రీనగర్ -బారాముల్లా మీదుగా తిరిగనుంది. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాడిన తర్వాత ప్రధాని మోడీ చేపట్టిన రెండో పర్యటన ఇది.. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.

Read Also: YSR Kalyanamasthu: నేడు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల

ఇదిలా ఉండగా జమ్మూ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కొత్త టెర్మినల్ 40 వేల చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 2000 మంది ప్రయాణికులకు సేవలను అందించవచ్చు. దీంతో పాటు ఈ టెర్మినల్‌లో ఆధునిక సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ కార్యక్రమంలో జమ్మూ – కత్రా మధ్య నిర్మించిన ఢిల్లీ- అమృత్‌సర్- కత్రా ఎక్స్‌ప్రెస్‌వే రెండు ప్యాకేజీలతో పాటు ఇతర ముఖ్యమైన రహదారి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. జమ్మూలో కామన్ యూజర్ ఫెసిలిటీ పెట్రోలియం డిపోను అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు కూడా నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు.

Exit mobile version