NTV Telugu Site icon

Neeraj Chopra: నీరజ్‌ చోప్రా భారత్‌ను గర్వించేలా చేశాడు.. ప్రధాని మోడీ ప్రశంసలు!

Neeraj Chopra Silver

Neeraj Chopra Silver

President Droupadi Murmu Congratulates Neeraj Chopra For Olympic Silver: పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత స్టార్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన జావెలిన్‌ త్రో ఫైనల్‌లో నీరజ్‌ ఈటెను 89.45 మీటర్లు విసిరి రజత పతకం కైసవం చేసుకున్నాడు. పాక్‌ అథ్లెట్‌ నదీమ్‌ అర్షద్‌ ఈటెను 92.97 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు. ఇక గ్రెనడా అథ్లెట్‌ పీటర్స్‌ అండర్సన్‌ 88.54 మీటర్లతో కాంస్యం గెలుచుకున్నాడు. సిల్వర్‌ మెడల్‌ సాధించిన నీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన బల్లెం వీరుడు నీరజ్‌ చోప్రాకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ‘నీరజ్‌ చోప్రా అద్భతమైన వ్యక్తి. తన ప్రతిభను మరోసారి చాటాడు. నీరజ్ మరో ఒలింపిక్‌ మెడల్‌తో భారత్‌ను గర్వించేలా చేశాడు. రజతం సాధించిన నీరజ్‌కు అభినందనలు. యువ అథ్లెట్లు తమ కలలను నెరవేర్చుకోవడానికి, భారత్‌ను గర్వపడేలా చేయడానికి నీరజ్‌ స్ఫూర్తి కొనసాగుతూనే ఉంటుంది’ అని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

Also Read: Neeraj Chopra: రజత పతకం సాధించిన నీరజ్‌ చోప్రా.. చరిత్ర సృష్టించిన బల్లెం వీరుడు!

సిల్వర్ సాధించిన నీరజ్‌ చోప్రాపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసలు కురిపించారు. ‘చరిత్ర సృష్టించిన నీరజ్‌కు అభినందనలు. వరుస ఒలింపిక్స్‌ల్లో బంగారు, రజత పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టించాడు. నీరజ్‌ను చూసి దేశం మొత్తం గర్విస్తోంది. వచ్చే తరాలకు అతడు స్ఫూర్తిగా నిలుస్తాడు. రాబోయే రోజుల్లో భారత్‌కు మరిన్ని పతకాలు, కీర్తిని తీసుకురావాలని దేశం కోరుకుంటోంది’ అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Show comments