Site icon NTV Telugu

Digvijaya Singh: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశాడు మోడీ..

Divijay

Divijay

Congress: భాతరదేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఇక, ఇవాళ మోడీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో దిగ్గి హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో డాక్యుమెంట్ విడుదల చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీ, అదానీ లాంటి కుబేరులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. దేశ రాజధాని సరిహద్దుల్లో తమ హక్కుల కోసం రైతులు ఆందోళణ చేస్తున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.

Read Also: Pragya Jaiswal: చూపులతో కట్టిపేడస్తున్న ప్రగ్యా జైస్వాల్…

ఇక, దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ భారతదేశంలో పెరుగుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు.. తన యాత్రలో రాహుల్ ప్రధానంగా ఐదు సమస్యలు పరిశీలించారు.. దేశంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మోడీ సర్కార్ అన్యాయం చేస్తోంది.. అలాగే, మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. స్వతంత్రం వచ్చిన తర్వాత మోడీ లాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు అని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.

Exit mobile version